ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరిగేది మరో ఎత్తు.. ఆ మాట ఎవరో అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై పెద్దగా పెదవి విప్పని పెద్ద మనిషి ఒకరు తమ అంతర్గత సంభాషణల్లో చేసిన వ్యాఖ్య ఇది.
‘మా’ ఎన్నికల ఎపిసోడ్ మొదలు కావటానికి కొద్ది నెలల ముందే జరుగుతున్న పరిణామాలు.. తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులన్ని ఒక లెక్క అయితే.. ‘మా’ పోలింగ్ రోజున జరిగిన పరిణామాలకు సంబంధించి ప్రకంపనలు తప్పవని చెబుతున్నారు.
ఇవాల్టి రోజున చిన్న పిల్లాడ్ని ఏదైనా ఒక మాట అంటే.. దానికి ముఖం పగిలేలా.. ఫటేల్మని సమాధానం ఇస్తున్న కాలం. ఇలాంటి రోజుల్లో తోపుల్లాంటి వారంతా కామ్ అయిపోయే పరిస్థితి. ఒకరకంగా చూస్తే.. ఏమన్నప్పటికి మౌనంగా ఉండాలన్న రీతిలో వ్యవహరించిన తీరు చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితి. పోలింగ్ రోజున ఏం జరిగిందన్న దాని గురించి ప్రకాశ్ రాజ్ టీం ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించటమే కాదు.. ఎన్నికల్లో గెలిచిన వారంతా తమ పదవులకు రాజీనామాలు చేయటం తెలిసిందే.
సీనియర్ నటుడు.. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. మంచు ఫ్యామిలీ మీద చెరపలేని మరకలా మారింది.
‘మా’ ఎన్నికల ప్రచారంలో తరచూ పైచేయి ప్రదర్శించిన విష్ణు మాట్లాడలేని పరిస్థితికి.. సమాధానం చెప్పలేని రీతిలో పోలింగ్ ఘటనలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే ప్రకాశ్ రాజ్ టీం పెట్టిన ప్రెస్ మీట్ కు కౌంటర్ గా అవతలి వర్గం వారు ఏమీ చేయకుండా మౌనంగా ఉండిపోయారు.
అయితే.. దసరా పండగ సందర్భంగా మంచు విష్ణుకు దిమ్మ తిరిగిపోయే షాకిచ్చేందుకు ప్రకాశ్ రాజ్ టీం ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. అదేమిటన్న విషయాన్ని రివీల్ చేయటం లేదు కానీ.. దానికిసంబంధించిన కసరత్తు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్లానింగ్ వారి ఇమేజ్ ను పెంచటంతో పాటు.. విష్ణు ఆత్మరక్షణలో పడేలా చేస్తుందని చెబుతున్నారు.
తమ జరిగిన దానికి అంతకంతకూ బదులు చెప్పాల్సిన అవసరం ఉందని.. కానీ ఆవేశంతో కాకుండా ఆలోచనతోనే ముందుకు సాగాలన్న దోరణిలో వారు ఉన్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రకాశ్ రాజ్ టీం ప్లానింగ్ తెర మీదకు వస్తే.. ‘మంచు’కు అంతో ఇంతో చెమటలు పట్టటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అదెంత వరకు నిజమన్నది కాలమే సరైన సమాధానం చెబుతుందని చెప్పక తప్పదు.