‘రాధే శ్యామ్’ తీర్పును ప్రేక్షకుల నుండి విన్న తర్వాత బాహుబలి ప్రభాస్ రెండ్రోజుల క్రితం స్పెయిన్ వెళ్లిపోయాడు. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను పొందడంతో పాటు బాలీవుడ్ సర్కిల్లలో విఫల సినిమాగా నిలిచింది. పాన్ ఇండియా స్టార్ హీరో భారీ బడ్జెట్ సినిమా కేవలం 30 శాతం షేర్ కూడా రాబట్టలేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
సినిమా సంగతి పక్కన పెడితే ప్రభాస్ స్పెయిన్ ఎందుకు వెళ్లాడు? ఆరా తీయగా తెలిసింది ఏంటంటే… ఒక ఆరోగ్య సమస్యతో ప్రభాస్ స్పెయిన్ వెళ్లాడని తెలిసింది.
రెండు నెలల క్రితం “సాలార్” సినిమా షూటింగ్ సమయంలో హీరో ప్రభాస్ గాయపడటంతో, అతను బార్సిలోనాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. సర్జరీ చిన్నది అయినప్పటికి, త్వరగా కోలుకునేలా తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
ఇక రాధే శ్యామ్ విషయానికి వస్తే, ప్రేక్షకులు ప్రభాస్ మళ్లీ ఇలాంటి తప్పు చేయొద్దు అని కోరుతున్నారు.