ప్రభాస్ అభిమానుల కోసం ఇంకో చిన్న ట్రీట్ ఇచ్చాడు అతడి పెదనాన్న కృష్ణంరాజు. తన నట వారసుడితో కలిసి చాలా ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయన.. రాధేశ్యామ్ లొకేషన్లో తీసిన ఒక ఆహ్లాదకరమైన ఫొటోను ట్విట్టర్లో పంచుకుని అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి ఉన్న ఇలాంటి ఫొటో ఇప్పటిదాకా అభిమానులు చూసి ఉండరంటే అతిశయోక్తి కాదు.
కొడుకుతో కలిసి యవ్వనంలోకి వెళ్లి ఫోజు పెట్టి ఫొటో దిగి ప్రభాస్ అభిమానులకు అంకితం ఇచ్చాడు చూడండి… ఎంజాయ్ చేస్తారు మీరు కూడా.