జగన్ పై బాబు పంచ్.. భలే పేలిందిలే
ఏపీలో జగన్ చేతికి అధికారం వచ్చినప్పటి నుంచి పరిశ్రమలు పడకేశాయి. ఉద్యోగాలు పోయాయి. చాలాకంపెనీలు రావడమే ఆగిపోయింది. దీంతో ఉపాధి సృష్టి శూన్యంగా మారింది. ఎన్నో వనరులు ఉండి పొట్ట చేతపట్టుకుని జనం హైదరాబాదుకు వచ్చే పరిస్థితి.
ఇంకోవైపు నిర్మాణ రంగం ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. దేవాదాయ శాఖ నుంచి లేదా ఇంకో చోట నుంచో కేంద్ర అభివృద్ధి నిధులను మళ్లించడం ద్వారా అమాయకులను సంక్షేమ పథకాల పేరుతో మభ్య పెట్టడం... అభివృద్ధిని అటకెక్కించడం.. దీనివల్ల ఏపీలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి నిర్మాణ రంగం జీరో అయింది. ఉపాధి అసలు లేదు. నిర్మాణ రంగానికి అనుబంధంగా నడిచే అనేక రకాల వ్యాపారాలు పడకేశాయి. దీంతో ప్రభుత్వ ఆదాయమూ తగ్గిపోయింది.
ఇవన్నీ ఒకెత్తు అయితే... ఒకవైపు అమరావతిని బంద్ చేసి తన అసమర్థతను చాటుకున్న ముఖ్యమంత్రి, మరోవైపు విశాఖ ఉక్కును కేంద్రం అమ్ముతుంటే వారికి ఎదురుచెప్పే ధైర్యం లేక వద్దనలేక నోరు కట్టేసుకుని మోడీ సర్కారు చెప్పింది చేసేస్తున్నాడు.
తాజాగా వైజాగ్ స్టీల్ అమ్మకంపై వైజాగ్ ప్రజలు రగిలిపోతున్నారు. తెలుగుదేశం నేత నిరాహార దీక్షకు దిగితే అతన్ని నిర్బంధించి ఆస్పత్రికి తరలించింది జగన్ సర్కారు. దీంతో చంద్రబాబు వెంటనే వైజాగ్ వెళ్లి ఆయన్ను పరామర్శించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. జగన్ ఓ దొంగల ముఠా సభ్యుడు. నేనిక్కడికి వచ్చానా... రేపో మాపో పరుగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన వెంటనే ఆ శారదా పీఠం పోతాడు. వీరంతా ఒక దొంగల ముఠా. నేను సాధారణంగా ఎవరినీ తిట్టను. కానీ వీళ్లు చేసే పని , వీళ్ల కుట్రలు రాష్ట్రాన్ని ముంచేస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ వీడియో ఈ కింద చూడొచ్చు.
Ee roju Nenu ikkadiki vasthunna ante repo maapo vasthadu sharadapeetam donga Swamy ni kalavadaniki 😂😂😂😂😂
— Bhavya🦩 (@unexpected5678) February 16, 2021
Veellandaru peddha mutanayakulu @ncbn 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/zLaaoRfy8B
బాబాయ్ ని చంపేసి నేను తండ్రి లేని బిడ్డ అని ఏడ్చినట్టుంది..!🤭
— Supraja (@SuprajaKilari) February 16, 2021
Made my day!!!😹😹 pic.twitter.com/OlfBGSm1Kp