బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దేశంలోనే అతిపెద్ద మల్టీస్టారర్‌కి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యాడు. ఇందులో పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఖరారు అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మిస్తుంది. అతి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. 2024లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం 2025లో విడుదల కానుందంటున్నారు.
సిద్ధార్థ్ ఆనంద్ యొక్క తాజాగా పఠాన్ సినిమాతో భారతీయ బాక్సాఫీస్ ను కొల్లగొట్టాడు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం అందులో ప్రధాన పాత్రలు పోషించారు. గత రెండేళ్లుగా సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ చర్చలు జరుపుతున్నాడు. అదిప్పటికి కొలిక్కి వచ్చింది.
హృతిక్ రోషన్, ప్రభాస్ మరియు సిద్ధార్థ్ ఆనంద్ దేశంలోనే అతిపెద్ద మల్టీస్టారర్ కోసం భారీ పారితోషికం తీసుకోనున్నారు. ఇది ఆల్ టైం రికార్డ్ అవ్వచ్చంటున్నారు. ప్రభాస్, హృతిక్ రోషన్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడటం ప్రేక్షకులకు గ్రేట ట్రీట్ అంటోంది సినీ లోకం.
హృతిక్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ఫైటర్‌లో నటిస్తున్నాడు ప్రభాస్ కు వరుసగా సినిమాలు ఉన్నాయి. అవన్నీ 2023లో షూటింగ్ పూర్తవుతాయి.