జగన్ అధికారంలోకి వచ్చిన మరు క్షణమే తన విధ్వంసకర పాలనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రజావేదికతో మొదలుబెట్టిన కూల్చివేతల పర్వాన్ని తాజాగా అన్న క్యాంటీన్ ల కూల్చివేతల వరకూ జగన్ కొనసాగిస్తున్నారు. అయితే, పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నగారి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన అన్న క్యాంటీన్లను టీడీపీపై కక్షతోనే జగన్ కూల్చివేస్తున్నారు. ఐదు రూపాయలకే కడపునిండా భోజనం పెడుతున్న టీడీపీకి పొలిటికల్ మైలేజ్ దక్కకుండా పేదల నోటికాడి కూడా లాగేస్తున్నారు.
తాజాగా చిత్తూరు జిల్లాలో కూల్చివేసిన ఓ అన్న క్యాంటీన్ దగ్గర అన్నదానం చేస్తున్న సందర్భంగా రికార్డయిన ఓ వీడియో వైరల్ అయింది. కేవలం నాలుగు బల్లాలపైనే పాత్రలు ఉంచి అన్నదానం చేసేందుకు టీడీపీ నేతలు సిద్దపడ్డారు. అక్కడ అన్నం పెట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు…ఆకలితో ఉన్న నిరు పేదలు ప్లేట్లు పెట్టుకొని అన్నం తినేందుకు రెడీగా ఉన్నారు. ఇంతలోనే, దాదాపు 15 మంది పోలీసులు, మరో 15 మంది భద్రతా బలగాలకు చెందిన సిబ్బంది అక్కడకు వచ్చి బల్లాలను తీసేశారు.
అన్నదానం జరగడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. కళ్లముందు వడ్డించడానికి అన్నం సిద్ధంగా ఉంది..తినడానికి రెడీగా ఆకలిగొన్న పేదలున్నారు…కానీ, అన్నదానం జరగానికి వీల్లేదంటూ మధ్యలో పోలీసులు నిలబడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు, ఆకలితో అన్నం దొరుకుతుందనే ఆశతో వచ్చి అన్నం తినకుండా బాధతో వెనుదిరుగుతున్న అన్నార్తులకు మధ్య జరిగిన సంభాషణ వింటే మనసు విరిగిపోక మానదు.
‘‘విషం కంటే ఎక్కువైంది…అన్న పెట్టేది కూడా పాపమైపోయింది…అన్నం లేదులే పోండి..అన్నం దొరకనీయరిక్కడ…అన్నం పెట్టనీయరులే పోండి..’’ అంటూ నిర్వాహకులు బాధతో, ఆవేదనతో చెబుతున్న మాటలు మనసును కలిచివేయక మానవు. దీంతో, కేవలం రాజకీయం కోసం అన్న క్యాంటీన్లపై ఇంత కక్షగట్టిన జగన్ పై పేదవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జనంలో జగన్ కు వ్యతిరేకత మాత్రమే వస్తుందని మండిపడుతున్నారు.
అన్నపూర్ణాంధ్రప్రదేశ్ లో పట్టెడన్నం కూడా పెట్టనివ్వని అధ్వాన్నపు పరిపాలన సాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కడుపు కొట్టిన జగన్ కు తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెడ్తున్నారు. అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు అన్న చందంగా…అన్న క్యాంటీన్ల మాదిరిగా జగన్ అన్నం పెట్టరని, టీడీపీ వారిని పెట్టనివ్వరని మండిపడుతున్నారు.
అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో అన్నం కూడా పెట్టనివ్వని అధ్వాన్నపు పరిపాలన..#AnnaCanteen #JaganPaniAyipoyindhi pic.twitter.com/o9AR5lOj0D
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2022
అన్న క్యాంటీన్ అంటే జగన్ రెడ్డికి వణుకెందుకు? #AnnaCanteen#JaganPaniAyipoyindhi#AnnamPettiCheppandi pic.twitter.com/XF7v3GZrfy
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2022