• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ రాష్ట్ర సీఎంకు తలసాని వార్నింగ్

admin by admin
September 9, 2022
in Politics, Telangana, Top Stories
1
0
SHARES
152
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హైద‌రాబాద్‌లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పై అసోం సీఎం హిమంత బిశ్వకర్మ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీంతో, బిశ్వకర్మ ప్రసంగిస్తుండగానే టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు ఆయన మైకు లాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఎంజే మార్కెట్ వ‌ద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్పడింది.

కేసీఆర్ పై శ‌ర్మ విమర్శలు గుప్పిస్తుండగా నందుబిలాల్‌ అనే టీఆర్ఎస్ కార్యకర్త…స్టేజిపైకి దూసుకువచ్చాడు. స్టేజి వెనుక నుంచి వచ్చిన అతడు..శ‌ర్మ ముందున్న మైక్‌ను త‌న చేతిలోకి తీసుకొని శ‌ర్మ‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా అప్ర‌మ‌త్త‌మైన గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ స‌భ్యుల‌ు, పోలీసులు నందు బిలాల్‌ను అక్క‌డి నుంచి కింద‌కు దించి త‌ర‌లించారు. దీంతో, ఆ వ్యవహారం సద్దుమణిగింది.

ఈ సందర్భంగా బిశ్వకర్మపై, బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బిశ్వశర్మ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. హైద‌రాబాద్‌ను ప్ర‌శాంతంగా ఉండ‌నీయ‌రా? అంటూ బీజేపీ నేత‌లపై ఫైర్ అయ్యారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డానికే బిశ్వ శ‌ర్మ న‌గ‌రానికి వ‌చ్చార‌ని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి హైదరాబాద్ కు వచ్చిన బిశ్వశర్మ…రాజకీయాలు మాట్లాడడం ఏంటని తలసాని ప్రశ్నించారు.

ఒక రాష్ట్ర సీఎం ఇలా దిగజారుడు మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదికపై తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం సరి కాదన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని, దీనిని తెలంగాణ ప్రజలెవరూ క్షమించరని అన్నారు. గవర్నర్ తమిళి సైపైనా తలసాని మండిపడ్డారు. గవర్నర్ తన పరిమితులకు మించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వాన్ని గవర్నర్ విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు. గవర్నర్ పదవికి కొన్ని పరిమితులు, బాధ్యతలు ఉంటాయనే విషయం ఆమె గుర్తుంచుకోవాలన్నారు. రాజ్యాంగానికి లోబడి మాత్రమే గవర్నర్ పని చేయాల్సి ఉందని చెప్పారు. రాజ్ భవన్ లో గవర్నర్ మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మంచి పద్దతి కాదన్నారు.

Tags: cm biswakarmaganesh immersiongovernor tamilisaiminister talasanitalasani's comments
Previous Post

కేసీఆర్ పై ఆ సీఎం వివాదాస్పద కామెంట్లు

Next Post

జగన్ కు ఆ పేదోళ్ల ఉసురు తప్పదు…వైరల్ వీడియో

Related Posts

nara lokesh yuvagalam1
Trending

యువ‌గ‌ళం ఎలా స‌క్సెస్ అవుతోంది… వైసీపీ అంత‌ర్మ‌థ‌నం …!

December 1, 2023
revanth and sanjay
Andhra

తెలంగాణ‌ .. గెలుపుపై ఏపీలో పందాలు…!

December 1, 2023
jagan pawan cbn
Trending

ఇక‌, ఏపీ వంతు.. 30 రోజుల్లో మారనున్న సీన్‌..!

December 1, 2023
Trending

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

December 1, 2023
Telangana

తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో ఏం జ‌రుగుతుంది..?

December 1, 2023
KCR
Trending

కేసీఆర్ కూ ఓటమి తప్పదా ?

December 1, 2023
Load More
Next Post

జగన్ కు ఆ పేదోళ్ల ఉసురు తప్పదు...వైరల్ వీడియో

Comments 1

  1. Pingback: ఆ రాష్ట్ర సీఎంకు తలసాని వార్నింగ్ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • యువ‌గ‌ళం ఎలా స‌క్సెస్ అవుతోంది… వైసీపీ అంత‌ర్మ‌థ‌నం …!
  • తెలంగాణ‌ .. గెలుపుపై ఏపీలో పందాలు…!
  • ఇక‌, ఏపీ వంతు.. 30 రోజుల్లో మారనున్న సీన్‌..!
  • కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!
  • తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో ఏం జ‌రుగుతుంది..?
  • కేసీఆర్ కూ ఓటమి తప్పదా ?
  • చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం
  • కేటీఆర్ ఫుల్ ఫ్రస్ట్రేషన్
  • ఎగ్జిట్ పోల్…కేటీఆర్ కు రేవంత్ కౌంటర్
  • కేసీఆర్ సారూ..అలానే చేశారు!
  • కవితపై ఎఫ్ఐఆర్..రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
  • ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!
  • సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?
  • కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?
  • ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

బాబు అక్రమ అరెస్టు..ఆత్మరక్షణలో బీజేపీ!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra