సినీ నటుడు పవన్ కల్యాణ్ పై, దర్శకుడు త్రివిక్రమ్ పై నటి పూనమ్ కౌర్ కొంతకాలంగా పరోక్షంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘‘ఉస్తాద్ భగత్ సింగ్’’ పోస్టర్ పై పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పోస్టర్లో పవన్ కళ్యాణ్ పాదాల కింద భగత్ సింగ్ పేరును ఉంచడంపై పూనం కౌర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధులను గౌరవించక పోయినా పర్వాలేదు. అవమానించకండి అంటూ పవన్ పై పూనం పరోక్షంగా సెటైర్లు వేశారు. కానీ, ఆ విమర్శలకు పవన్ ఏనాడూ స్పందించకపోవడం విశేషం.
ఇక, బండ్ల గణేష్ గురు పౌర్ణమి సందర్భంగా తన గురువు అయిన పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ట్విట్టర్లో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే ఇకపై తన గురువు పేరుని వాడుకోనని, వాడుకునే ప్రయత్నం కూడా చేయనని బండ్ల చెప్పారు. అవసరమైతే గురువుకు సాయపడతానని, లేదంటే ఆయనకు దూరంగా ఉంటానని బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పూనమ్ తన ఇంస్టాగ్రామ్ లో సంచలన సంచలన పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కడిని గురువు అని పిలవొద్దని, స్టేజి మీద నీతులు చెప్పి నిజ జీవితాలతో ఆడుకునే వారు గురువు కాదని పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై పూనం షాకింగ్ కామెంట్ చేసింది.
జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదని, దారి చూపించే వాడే గురువు అని చెప్పుకొచ్చింది. అందుకే, అందరికీ తాను రిక్వెస్ట్ చేస్తున్నానని, కనిపించిన ప్రతి టామ్, డిక్, హారీని గురువు అనొద్దని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ట్వీట్ చేసిన వెంటనే గురువు అనొద్దు అంటూ పూనం ఇన్ స్టాలో స్టోరీ షేర్ చేయడంతో పవన్ ని పూనం పరోక్షంగా విమర్శించిందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కూడా గతంలో పూనం కౌర్ పలుమార్లు పరోక్షంగా విమర్శలు గుప్పించినట్టుగా సోషల్ మీడియాలో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.