పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్న ఈ బుట్టబొమ్మ.. త్వరలోనే `రాధేశ్యామ్` వంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు, భాగ్యశ్రీ, జగపతిబాబు, సత్యరాజ్ కీలక పాత్రలను పోషించారు.
70ల కాలంనాటి రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రమిది. ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్ నటించారు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను పంచుకుంది. స్వీట్ పర్సన్ అంటూ కోస్టార్ ప్రభాస్ పై పొగడ్తల వర్షం కురిపించింది. అలాగే తన మనసులో ఉన్న ఓ కోరిక కూడా బయటపెట్టేసింది.
అసలేం జరిగిదందంటే.. ఇంటర్వ్యూలో `ఏ హీరోతో నటించే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు?` అని ప్రశ్నించగా.. అందుకు పూజా హెగ్డే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురి పేర్లను చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. కమల్‌హాసన్, రణ్‌బీర్ కపూర్, ధనుష్‌లతో వర్క్ చేయాలనే కోరిక ఉందంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు పూజా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఈమె కోరిక తీరుతుందా..? లేదా..? అన్నది చూడాలి.
కాగా, పూజా హెగ్డే ప్రస్తుతం విజయ్ దళపతి సరసన `బీస్ట్` అనే సినిమా చేసింది. అలాగే తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన `ఆచార్య`లో రామ్ చరణ్‌కు జోడీగా చేసింది. మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా పూజా చేతిలో ఉన్నాయని అంటున్నారు.