హిట్లు ఉంటే ఇండస్ట్రీలో ఫేట్లు మారిపోయి, తిరుగులేని నమ్మకాలు కుదిరిపోతాయి ఆయా వ్యక్తులపై .. ! ఫ్లాపులు ఉంటే మాత్రం అస్సలు వారి వైపు చూడనైనా చూడరు. విజయవంతం అయిన వారికి ఇవన్నీ తెలుసు. అందుకే వారంతా ఏవీ పట్టించుకోకుండా ఉండాలనే అనుకుంటారు. కానీ పూజా బేబీ అపజయాలకు ఇంకా కొత్త. అందుకే ట్రోల్స్ ను ఎలా ఫేస్ చేయనుందో మరి!
తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరు పూజాహెగ్డే.. తెలుగులో మొదటి సినిమా ముకుంద తోనే నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత ఏడాది కి ఒకటో రెండో సినిమాలు చేస్తూ బిజిగా అయిపోయింది. మొదటి రెండు , మూడు సినిమాలలో చాలా పద్ధతిగా కనిపించింది. తర్వాత అల్లు అర్జున్- హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన డీజే సినిమాలో అందాల విందు చేసింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలను అందుకోక పోయిన కూడా ఆమె అందానికి మంచి మార్కులు పడ్డాయి.. దాంతో వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది..
ఆ చిత్రం తర్వాత మహేశ్ బాబు తో మహర్షి సినిమాలో నటించింది. ఆ సినిమా ఊహకు అందని విధంగా ఘన విజయాన్ని సాధించింది..మహేశ్ కూ పూజాకూ కెరియర్ టర్నింగ్ పాయింట్ అయ్యింది..ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా వరకూ వచ్చిన అన్నీ సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి. అంతవరకూ అమ్మడి అదృష్టం బాగుందనే చెప్పాలి. తరువాత అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా నటించి మెప్పించింది.
తరువాత ఏమయింది బ్రో
అటు బాలీవుడ్, కోలీవుడ్,టాలీవుడ్ లో వచ్చిన పూజాహెగ్డే సినిమాలలో ఒక్క సినిమా కూడా హిట్ టాక్ అందుకోలేక పోయింది. ప్రభాస్ తో వచ్చిన రాధేశ్యామ్ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. మొన్న వచ్చిన తమిళ హీరో విజయ్ బీస్ట్ సినిమా కూడా బుట్ట బొమ్మకు నిరాశే మిగిల్చింది.. ఇక తాజాగా వచ్చిన మెగా సినిమా ఆచార్య కూడా ప్లాప్ అవ్వడంతో అమ్మడు సినిమా లైఫ్ ఎటుపోనుందో ఇక ?