ముఖ్యమంత్రి జగన్పై రాష్ట్రంలోని హిందూ ధర్మంపైనా.. ఆలయాలపై ఆకస్మిక ప్రేమ పుట్టుకొచ్చిందని అంటున్నారు పరిశీలకులు. వరుసగా ఆయన మూడు రోజులపాటు మూడు జిల్లాల్లోని ప్రముఖ ఆలయా లను, మఠాలను కూడా సందర్శించనున్నారు. ఈ నెల 17న విశాఖలో సీఎం పర్యటిస్తారు. విశాఖ శ్రీశార దా పీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఈ నెల 18న తిరుపతికి వెళతారు. శ్రీవారి దర్శించుకుంటా రు. 19న తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదికి వెళతారు.
అంతర్వేదిలో నృసింహస్వామి ఆలయ రథం సిద్ధం కావడంతో దాన్ని సీఎం పరిశీలిస్తారు. అదేసమయంలో దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. ఇలా ముఖ్యమంత్రి జగన్ వరుసగా ఆలయాల సందర్భన చేస్తుండడం ఆసక్తిగా మారిందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరిగిన నేపథ్యంలో ఒకేసారి మూడు జిల్లాల్లో సీఎం ఆధ్యాత్మిక పర్యటన చేపట్టడం గమనార్హం. ఇటీవల రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆలయాలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే.
విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో ఉత్సవ రథంపై మూడు వెండి సింహాలు మాయమవడం, అంతర్వేదిలో నృసింహస్వామి ఆలయ రథం దగ్ధమవడం, విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం తలను వేరుచేయడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆలయాల్లో దాడులు జరిగాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే.. ఇప్పటి వరకు స్వయంగా ఆయా ఘటనలపై సీఎం జగన్ నోరు విప్పి మాట్లాడింది లేదు. దీంతో ఇప్పుడు వరుసగా మూడు జిల్లాలో సీఎం ఆధ్యాత్మిక పర్యటనలు చేపట్టనుండటంతో ఆయా ఘటనలపై మాట్లాడతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అదేసమయంలో తాజాగా నిర్ణయించుకున్న ఈ పర్యటనల వెనుక రాజకీయ కోణం కూడా ఉందనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. త్వరలోనే కర్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. అవన్నీ.. నగరాలు, పట్టణాలే కావడంతో.. ప్రజలను ఆకర్షిం చేందుకు జగన్ ఇలా చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతుండడం గమనార్హం. మరి వ్యూహం ఏదైనా.. జగన్ వరుస పర్యటనలు.. ఆలయాలపై ఆకస్మిక ప్రేమ వంటివి మాత్రం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడం గమనార్హం.