స్పేస్.. అంతరిక్షం.. ఏదైనా భారత ముద్ర పడాల్సిందే! ఇదీ.. ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తీసుకుంటున్న పంథా. ఈ క్రమంలోనే అంతరిక్షంపై మరింత పట్టు పెంచుకునేందుకు గత కొన్నాళ్లుగా మోడీ సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా 2024-40 వరకు భారత అంతరిక్ష రంగం చేపట్టే పలు కీలక ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది. ఈ మధ్య కాలంలో ఆయా ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు సమకూర్చనుంది. ఈ మేరకు తాజాగా మోడీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం సంచలన నిర్ణయాలు తీసుకుంది.
+ `చంద్రయాన్` సిరీస్లకు మరింత ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు.. భవిష్యత్తులో చంద్రగ్రహంపై మరింత పట్టుకు ప్రయత్నించేలా నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పటికే చేపట్టిన చంద్రబాబు-1, 2, 3తో పాటు.. చంద్రయాన్-4కు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
+ చంద్రయాన్ 4 మిషన్ ద్వారా .. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ప్రయోగాలు చేయనున్నారు. అక్కడ ఉన్న మన్ను శాంపిల్స్ సేకరించి తీసుకువచ్చి ప్రయోగాలు చేయనున్నారు. అదేవిధంగా చంద్రుడిపై నుంచి `చంద్రయాన్ 3` నుంచి అవసరమైన టెక్నాలజీని సైతం తిరిగి వెనక్కి తీసుకురానున్నారు. చంద్రుడి మీదకి వెళ్లడంతో పాటు అక్కడి నుంచి భూమికి తిరిగొచ్చేలా చంద్రయాన్ 4లో సాంకేతికతను అభివృద్ధి చేస్తారు.
+ 2040 నాటికి చంద్రయాన్-4ను చేపట్టనున్నారు. దీనికి గాను భారీ నిధులు సమకూర్చేందుకు మోడీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక, ఎప్పటి నుంచో మోడీ సర్కారు తలపిస్తున్న భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఓకే చెప్పింది. 2035 నాటికి ఈ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
+ 2040లో మానవ సహిత ప్రయోగానికి కూడా మోడీ సర్కారు ఓకే చెప్పింది. ఇది చంద్రయాన్ 4 మిషన్ ద్వారా సాకారం కానుంది. నెలరేడుపై ల్యాండింగ్ అయి, అక్కడి నుంచి భూమి మీదకి సురక్షితంగా ల్యాండింగ్ కావాలన్నదే చంద్రయాన్-4 లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. మొత్తానికి అంతరిక్షంపై భారత్ అనంతపట్టు సంపాయించుకునేలా మోడీ సర్కారు నిర్ణయించింది. చంద్రయాన్ సహా ఇతర ప్రయోగాలకు వచ్చే పదేళ్ల కాలానికి లక్ష కోట్ల రూపాయలకు పైగానే వెచ్చించనున్నారు.