జార్ఖండ్ లో రాజకీయ దుమారం రేగింది. ప్రస్తుతం ఉన్న జేఎంఎం కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసేందు కు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు.. మరో మహా రాష్ట్ర రాజకీయాలను ప్రతిబింబిస్తున్నాయి. ప్రస్తుతం జార్ఖండ్ జేఎంఎం, కాంగ్రెస్ మిత్రపక్షంగా సర్కా రును నడిపిస్తున్నాయి. అయితే.. ఇక్కడ వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నాయకు లు సర్కారును ఏర్పాటు చేయాలన్న కుతూహలంతో ఉన్నారు.
అయితే.. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఇక్కడే తెరచాటు రాజకీయాలతో బీజేపీ చేస్తున్న వ్యూహాత్మక పాలిటిక్స్ మాత్రం అందరినీ ఆశ్చర్యా నికి గురిచేస్తున్నాయి. కొన్నాళ్ల కిందట అప్పటిముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను భూముల కుంభకోణం లో అరెస్టు చేయించిన దగ్గర నుంచి ఆయన కుటుంబంలోనే సొంత వదిన రూపంలో చిచ్చు పెట్టే ప్రయ త్నాలు జరిగాయి. మొత్తానికి న్యాయపోరాటం ఫలించి.. హేమంత్ సొరేన్ జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు.
ఇంతలోనే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి చంపయ్ సొరేన్ రూపంలో మరో రాజకీయ రగడ తెరమీదకి వచ్చింది. జేఎంఎంలో కీలక పాత్ర పోషించడంతోపాటు.. పార్టీకి అండగా ఉన్న చంపయ్ ను బీజేపీ తనవైపు లాక్కునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో జార్ఖండ్ రాజకీయం ప్రస్తు తం ఢిల్లీకి చేరింది. ఆయన వెంట సుమారు 30 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్న వ్యవహారం. ఈయన కనుక బీజేపీలో చేరిపోతే ఆ వెంటనే హేమంత్ సర్కారుకు మేజిక్ ఫిగర్ తగ్గి సర్కారు కూలుతుంది.
తద్వారా.. జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేయాలనేది కేంద్రంలోని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోం ది. తద్వారా వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ముందుగానే పునాదులు పదిలం చేసుకుని రాజకీ యంగా దూకుడు ప్రదర్శించాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. మొత్తానికి చంపయ్‌ను ఆయుధంగా చేసుకుని అతనిలో అసంతృప్తిని రగిలించడం ద్వారా జేఎంఎంలో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకొనేందు కు ప్రయత్నిస్తుండడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుండడం గమనార్హం.