ఎలాంటి విషయాన్ని అయినా తమకు అనుకూలంగా మలచుకుని మాట్లాడటంలో బీజేపీ వాళ్లు ఆరితేరిపోయారు. వారు ఎంతకు తెగించారంటే చివరకు RRR హిట్ కూడా మోడీ పాలనలోనే సాధ్యమట. ఇంతకంటే విచిత్రమైన వ్యాఖ్య ఉంటుందా?
ఇంతకీ ఈ మాట ఎవరన్నారు? ఎపుడన్నారు?
వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా మీడియాతో మాట్లాడారు. “RRR చిత్రం బహుశా దేశంలోనే అతిపెద్ద చిత్రం అన్నారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన చిత్రం అన్నారు. త్రిబులార్ రూ. 750 కోట్లకు పైగా వసూలు చేసింది అన్నారు.
ఆయన అంతటి వరకు ఆగితే బానే ఉండేది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ రికార్డుల తర్వాత రికార్డులను బద్దలు కొడుతోంది. దీనికి RRR కూడా ఒక ఉదాహరణ. ప్రధానిగా నరేంద్ర మోదీ పాలనలో ఇలాంటి విజయాలు అన్ని చోట్లా సాధ్యమని అన్నారు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క ఎగుమతుల సంఖ్య $418 బిలియన్లకు చేరుకున్న సందర్భంగా ఏర్పాటుచేసని సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.