కుప్పం నియోజకవర్గం పంచాయతీల్లో గెలిచామని చెప్పుకోవాలంటే..ఏం చేయాలి? టిడిపి మద్దతుదారులను కొనాలి. అమ్ముడుపోకపోతే కొట్టాలి. బెదిరించాలి. బెదరకపోతే అక్రమ కేసుల్లో నిర్బంధించాలి. ఈ మొత్తం వ్యూహం అధికారయంత్రాంగం అండతో పెద్దిరెడ్డి సమకూర్చిన 72 కోట్లతో దిగ్విజయంగా పూర్తి చేశారు. కుప్పం అంటే నారా చంద్రబాబునాయుడు ఏడుసార్లుగా గెలిచిన తెలుగుదేశం కంచుకోట. ఆ కోటకు బీటలు పెట్టాలంటే ఇన్ని చేయాలి. ఇవన్నీ చేయాలంటే రెడ్‌శాండిల్ డాన్, మద్యం మాఫియా కింగ్ పిన్, దేశంలోనే అతి పెద్ద కాంట్రాక్టర్, జగన్‌రెడ్డి పార్టీకి ఆర్థిక అండ అయిన పెద్దిరెడ్డికే సాధ్యం. అందుకే కుప్పం బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు.
తెలుగుదేశం పార్టీ అదికారంలో వున్నప్పుడు నంద్యాల వైసీపీ సీటు నుంచి గెలిచి టిడిపి కండువా కప్పిన భూమా నాగిరెడ్డి మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ సీటు గెలిచి పట్టు నిరూపించుకోవాలనే అప్పటి అధికారంలో వున్న చంద్రబాబు దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టి ఈ సీటుని గెలిచారని ప్రచారం సాగింది. అప్పుడు గెలిచిన టిడిపి 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు వైఎస్ జగన్‌రెడ్డి అరాచక అధికారం, ఆర్థికంగా అనకొండలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో కుప్పంలో వందకోట్లు పంచాయతీ ఎన్నికలకు పోశారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు ఇంకెన్ని వందల కోట్లు కుప్పంలో కుమ్మరిస్తారో? అయితే నంద్యాల ఉప ఎన్నికలో టిడిపి గెలుపులాంటిదే..కుప్పంలో స్థానిక ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ గెలుపు అని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంలో ఉండటం, కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలకు మంత్రి పెద్దిరెడ్డి 72 కోట్లివ్వడం, జిల్లా యంత్రాంగాన్నంతా వైసీపీకి అనుకూలంగా పనిచేసేలా చేయడం, టిడిపి మద్దతుదారుల్ని కొనడం, బెదిరించడం, లొంగకపోతే అక్రమ అరెస్టులు, ఎన్నికల ఫలితాల తారుమారుతో వైసీపీ సాధించిన ఈ విజయాలు సాక్షిలో బేనర్ ఐటమ్‌గా పనికొస్తాయి కానీ.. ప్రజాబలం పెంచుకునేందుకు ఏమాత్రం ఉపయోగపడవని వైసీపీ వ్యూహకర్తలే తమలో తాము చర్చించుకుంటున్నారు.