తెలుగుదేశం పార్టీలో కొందరు నేతల మాటలు ప్రభుత్యానికిి శూలాల్లా గుచ్చుకుంటున్నాయి. సరైన కౌంటర్ ఇవ్వలేక సైలెన్సే సమాధానం అయిపోతోంది. ఏపీ ఆదాయ వ్యయాల గురించి ఆర్థిక మంత్రి బుగ్గన ప్రసంగం విన్న అనంతరం తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ప్రసంగంతో వైసీపీ ప్రభుత్వం ఫీజులు ఎగిరిపోయాయి.
అయ్యా ప్రజలను తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రభుత్వం చేస్తోందని ఆర్థిక మంత్రిగారు అంటున్నారు. అసలు ప్రభుత్వాన్ని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయమని మేము అడుగుతున్నాం అని అన్నారు.
కంపెనీలు తెచ్చి వ్యాపారం పెంచి రాష్ట్రానికి ఆదాయం పెంచకుండా అప్పులు తెచ్చి ఏదేదో చేస్తాం అంటున్నారు. మందు రేట్లు పెంచారు. పట్టణంలో పన్నులు పెంచారు. కేంద్రానికి అడ్డంగా నిలువుగా తలొగ్గారు. పక్క రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆన్ రికార్డ్ మీ బండారం బయటపెట్టారు. కేవలం 2 పర్సెంట్ అప్పుకోసం రైతులను, ప్రజలను మోడీకి జగన్ తాకట్టు పెట్టాడు అని మీ ఫ్రెండ్లీ మంత్రే చెప్పారు కదా అని విమర్శించారు.
అర్బన్ లో 10 శాతం ట్యాక్సు పెంచుతాం అంటున్నారు. వాస్తవానికి ప్రతికుటుంబం మీద భయంకరమైన భారం పడబోతోందని సంస్కరణలు చదివితే అర్థమవుతోంది అధ్యక్షా అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ని ఇంప్రూవ్ చేయమంటే పెట్టుబడులు పెట్టడానికే భయపడే పరిస్థితి తెచ్చారు అని పయ్యావుల ఆరోపించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ని ఈజ్ ఆఫ్ దోపిడీగా మార్చారు. మందు రేట్లు పెంచారు. మీరు ప్రజలపై వేయని భారం లేదు అని కేశవ్ మండిపడ్డారు .