మాస్ కా బాప్, నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ టు దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటికే స్ట్రీమ్ అయిన అన్ని ఎపిసోడ్ లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సీజన్ లోని ఓ ఎపిసోడ్ కు టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాబోతున్నారన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ షో కోసం ఏర్పాటు చేసిన షూటింగ్ సెట్ కు పవన్ కళ్యాణ్ హాజరైన పవర్ఫుల్ వీడియో ప్రొమోను ఆహా టీం విడుదల చేసింది. ఈ సీజన్ కు ఇదే పవర్ ఫుల్ ఎపిసోడ్ అని ఆహా టీం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా కనిపించడంతో బాలకృష్ణ సరదాగా కామెంట్ చేశారు. పవన్ వెళ్ళిపోయే లోపు ఆయన కొలతలు తీసుకోవాలంటూ పవన్ ను ఉద్దేశించి సరదాగా కామెంట్ చేశారు.
స్టైలిష్ గా పవన్ బ్లాక్ హుడ్డీలో చేతులు పెట్టుకోవడం బహుశా బాలకృష్ణకు నచ్చినట్టుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా పీఎస్పీకే వర్సెస్ ఎన్బీకే ఎపిసోడ్ కోసం ఇటు బాలకృష్ణ అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, ఇటీవల జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని అర్థం వచ్చేలాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఎపిసోడ్ కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ ఎపిసోడ్లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా పవన్ కు బాలయ్య ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా ఇటు సినీ వర్గాలలో, అటు రాజకీయ వర్గాలలో ఈ ఎపిసోడ్ పై ఆసక్తి ఏర్పడింది. ఆ సీజన్ తొలి ఎపిసోడ్ లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబును కూడా బాలయ్య పొలిటికల్ ప్రశ్నలు అడిగిన సంగతి తెలిసిందే.