వైసీపీ మహిళా నేత, ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాపై కొంతకాలంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది సంవత్సరాల క్రితం జనసేన పార్టీ కార్యకలాపాల కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ కొత్తగా 8 స్కార్పియో వాహనాలను కొనుగోలు చేశారు. అయితే, ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బుతోనే పవన్ ఆ స్కార్పియో లు కొన్నారని రోజాతో పాటు వైసీపీ నేతలు గతంలో విమర్శించారు.
దీంతో, రోజా కొద్ది నెలల క్రితం కోట్ల రూపాయలు పెట్టి బెంజ్ కారు కొనడంపై జనసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి కాగానే వచ్చిన అక్రమ సంపాదనతోనే రోజా బెంజ్ కారుకొని తన కుమారుడికి గిఫ్ట్ గా ఇచ్చారని రివేంజ్ కౌంటర్లు వేస్తున్నారు. గతంలో పవన్ పై రోజా చేసిన కామెంట్లకు జనసేన నేతలు కార్యకర్తలు రివేంజ్ తీర్చుకుంటున్నారు. అయితే, తాను జబర్దస్త్ లో చాలాకాలం పని చేశానని, 150 కి పైగా సినిమాలలో నటించానని అలాంటిది ఆ డబ్బుతో తాను కారు కొంటే తప్పేంటని రోజా ప్రశ్నిస్తున్నారు.
జబర్దస్త్ లో చిన్న చిన్న యాంకర్లు కూడా కార్లు కొంటున్నారని, తాను కొనడంలో తప్పులేదని సమర్థించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రోజాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సంవత్సరానికి దాదాపు 20-25 కోట్ల రూపాయలు టాక్స్ కట్టగలనని, అటువంటి తాను పార్టీ అవసరాల కోసం 8 జీపులు కొంటేనే వైసీపీ నేతలు రచ్చ రచ్చ చేశారని పవన్ పంచ్ లు వేశారు. వేల కోట్ల రూపాయలు ఉన్న జగన్ ఏమైనా కొనచ్చని ఆ పార్టీకి చెందిన మంత్రులు ఖరీదైన కార్లు కొనవచ్చని విమర్శించారు.
కానీ, తాను కష్టపడిన సొమ్ముతో జీపులు కొంటే తమ మీద పడి ఏడుస్తున్నారని పవన్ ఆరోపించారు. కోటిన్నర రూపాయలు డౌన్ పేమెంట్ కడితే 8 జీవులు వస్తాయని, వాటికి ప్రతి నెల ఈఎంఐ కట్టుకోవచ్చని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు అన్ని మచ్చలు పెట్టుకొని తమపై విమర్శలు గుప్పించడం మానుకోవాలని హితవు పలికారు. దీంతో, రోజాను ఉద్దేశించి పవన్ పరోక్షంగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.