చాలా రోజులకు పవన్ కళ్యాణ్ తన విశ్వరూపం చూపించారు. వైసీపీ మంత్రులు, ప్రభుత్వ ఓవర్ యాక్షన్ పై అతిపై తీవ్రంగా స్పందించారు. మీ పద్ధతి మార్చుకోకపోతే చాలా దారుణమైన శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు.
మీరు భయపెడితే భయపడడానికి ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్. కాదు వైసీపీ రిపబ్లిక్ అని మాట్లాడితే జనం బయటకు లాక్కొచ్చి కొడతారు. గుర్తుపెట్టుకోండి. అధికారం ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు లేకుండా పోతారు. ఎపుడైనా సరే అధికారంలో ఉన్న వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. లేకపోతే అధికారానికి దూరం కాక తప్పదు.
ఇరవై ఏళ్ల పాటు తిరుగులేని రీతిలో లిబియాను పాలించిన నియంత గఢాఫీ పరిస్థితి ఏమైందో చూశారు కదా. అలాంటి పెద్ద నియంత చేసిన తప్పులకు మూల్యం చెల్లించాడు. ఆ నియంతను ఒక చిన్న ఊళ్లో అక్కడి చిన్న కుర్రాళ్లు వీధుల్లో తరుముకుంటూ కొట్టి చంపేశారు.
అందుకే మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అనుకుంటున్నారేమో… ఒళ్లు దగ్గరపెట్టుకోండి. హద్దుల్లో ఉండాలి. కన్నెర్ర చేస్తే కాలిపోతారు.
పవన్ సనిమాలను ఆపేస్తే భయపడిపోతారని వైసీపీ వాళ్లు అనుకుంటున్నారు. చిత్రపరిశ్రమ వైపు చూస్తే వైసీపీ వాళ్లు కాలిపోతారనే విషయం గట్టిగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తే.. అతను నటించిన సినిమాలు ఆపేస్తే భయపడి కాళ్ల దగ్గరకు వస్తారని అనుకుంటున్నట్టు ఉన్నారు. అది మీ భ్రమ.
మీలాగ ఎవడి డబ్బును మేము సంపాదించుకోలేదు. అక్రమాలు చేసి, కాంట్రాక్టులు చేసి జనం డబ్బు దొబ్బలేదు. అడ్డగోలుగా వేల కోట్లు మాత్రం సంపాదించలేదు. జనాలను ఎంటర్ టైన్ చేసి డాన్సులు వేసి కిందా మీద పడి.. ఒళ్లువిరగ్గొట్టుకుని సినిమాలు చేస్తే… వాటిని చూసి వినోదం పొందడం ద్వారా మాకు జనం నుంచి డబ్బులు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ నుంచి జనం ఏం కోరుకుంటున్నారో ఇన్నాళ్లకు పవన్ అది చూపించాడు. పవన్ మాటలతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. తనలో చాలా విషయం ఉందని, దానిని బయటకు తీస్తే వైసీపీకే దడ తప్పదని తాజా ప్రసంగం ద్వారా పవన్ తేల్చాడు.