ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్ గా చేస్తున్నారంటూ తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు చేశారు.
అభివృద్ధి చేయాల్సిన చోట అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు.
రాజన్న రాజ్యం అంటే ఇంకేదో అనుకున్నాం… మొన్న #SandMafia, నిన్న #LiquorMafia, ఇవాళ #DrugMafia, ఇదేనా?
ఏపీ కి చెందిన కంపెనీ పేరు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మొత్తంలో డ్రగ్ పట్టుబడటం ఏంటి? ఆ కంపెనీ అడ్రస్ ఆధారంగా ఇంతవరకు ఎందుకు విచారణ చేయలేదు. దాని వెనుక ఎవరున్నారు.? అసలు విచారణ చేయకుండా ఆ కంపెనీకి పోలీసులు క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
ఉద్యాగాలు కల్పిస్తారని యువత ఓట్లు వేసి జగన్ ని సీఎంని చేస్తే, ఆయనేమొ యువతకు మత్తుపదార్ధం హెరాయిన్ అమ్ముదామని డిసైడయ్యారా అని నిలదీశారు.
అయితే, రామ్మోహన్ నాయుడు ఒకవైపు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే కాకినాడలో 3350 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు వార్తలు రావడం మరింత సంచలనం అయ్యింది.
ఏపీ సర్కారును ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేసిన రామన్న ఫుల్ వీడియో ఇక్కడ చూడొచ్చు
#APPabloEscobar జగన్ రాష్ట్రాన్ని DRUG MAFIA HUBగా మారుస్తున్నారు! మీరు తీసుకొస్తానన్న రాజన్న రాజ్యం ఇదేనా?
ఉద్యాగాలు కల్పిస్తారని యువత ఓట్లు వేసి జగన్ ని Hero చేస్తే, ఆయనేమొ యువతకు మత్తుపదార్ధం Heroin ఇస్తున్నారు.
మొన్న #SandMafia, నిన్న #LiquorMafia, ఇవాళ #DrugMafia, Next ఏంటి? pic.twitter.com/RQPupoRZYv— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) September 25, 2021