బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ పూర్తిగా సిద్ధమైపోయినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
రాష్ట్రంలో బీజేపీకి జనసేన వల్ల లాభమే గాని… జనసేనకి బీజేపీ వల్ల లాభం శూన్యం అని క్లియర్ గా అర్థం చేసుకున్న జనసేనాని వారిని వదిలేసి పోరాటం చేయాలని ఫిక్సయ్యారు.
అసలు పరోక్షంగా పోస్కో కంపెనీతో వ్యాపార సంబంధాలు, వాటాల కోసం విశాఖ ఉక్కుపై కన్నేసిన జగన్… దాని ప్రైవేటీకరణకు నాంది పలికాడు. అయితే, ఊహించని విధంగా ప్రజల నుంచి వ్యతిరేకత రావడం కేంద్రానికి లేఖలు రాసి తప్పించుకుంటున్నాడు.
చాలాకాలం దీనిపై పెద్దగా స్పందించని పవన్ కళ్యాణ్ ఇపుడు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే, విశాఖ ఉక్కు ఆంధ్రులు ఎంత కష్టపడి తెచ్చుకున్నది పాత జనరేషన్ కి బాగా తెలుసు.
హిస్టరీ అంటే చిరాకు పడే కొత్త జనరేషన్ కి విశాఖ ఉక్కు ఉద్యమం గురించి వివరించి వారిని పోరాటానికి రెడీ చేయడానికి పవన్ సిద్ధమయ్యారు. విశాఖ ఉక్కు కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వారి వివరాలు, కాళ్లు చేతులు పోగొట్టుకున్న వారి పెద్ద జాబితాను సచిత్రంగా ప్రజల ముందు పెట్టారు.
దీంతో ఉద్యమాన్ని మరింత రగిలించడానికి పవన్ ప్రయత్నం చేస్తున్నాడని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా తయారవుతున్నాయి.
‘విశాఖ ఉక్కు- ఆంధ్రులు హక్కు ' ఉద్యమంలో ,ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన అమర వీరుల పట్టిక (1) pic.twitter.com/rkl7x8hyhZ
— Pawan Kalyan (@PawanKalyan) November 7, 2021
Old News articles about Visakhapatnam steel plant issue. pic.twitter.com/W8mQVtsEda
— Pawan Kalyan (@PawanKalyan) November 7, 2021