కంచుకోట అయిన కడపలో వైసీపీ కథ కంచికేనా..? జగన్ లో కొత్త టెన్షన్ మొదలైందా..? వైసీపీ కోటలను పవన్ టార్గెట్ చేశారా..? అంటే అవునన్న సమాధనమే వినిస్తోంది. వైనాట్ 175 స్టేట్మెంట్ తో ఈ ఏడాది ఎన్నికల బరిలోకి దిగిన ఫ్యాన్ ఫార్టీకి పవర్ కట్ అవ్వడమే కాకుండా రెక్కలు సైతం విరిగిపడ్డాయి. ప్రతిపక్షమన్నదే లేకుండా సరికొత్త చరిత్ర లిఖిస్తామని తొడగొట్టిన వైసీపీ నాయకులు చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. తక్కు తుక్కుగా ఓడిపోయిన వైసీపీ నేతలంతా ఇప్పుడు కూటమి పార్టీల్లో కలిసి పోవడానికి క్యూ కట్టేశారు.
అయితే నేతలతోపాటు వైసీపీ కేడర్ సైతం చెదిరిపోతుంది. వైసీపీ కంచుకోటలపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురి పెట్టినట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ముందుగా కడపపై పవన్ ఫోకస్ పెట్టారట. కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ ఇప్పటికే మూడుసార్లు కడపలో పర్యటించారు. పల్లె పండుగ, స్టూడెంట్స్-పేరెంట్స్ మీటింగ్ ను అక్కడే నిర్వహించారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీఓ అధికారిని పరామర్శించేందుకు ఒకసారి కడపు వెళ్లారు.
అయితే ఈ వరుస పర్యటనల వెనుక బలమైన కారణమే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కడపలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారట. పులివెందులలో వైఎస్ వివేకానంద ఇల్లు ఖాళీ ఉంది. అక్కడ క్యాంపు ఆఫీస్ పెడితే అన్ని విధాలుగా బాగుంటుందని.. సెంట్రరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని పవన్ భావిస్తున్నారట.
ఇప్పటికే ఈ విషయంపై వివేకా కూతురు వైఎస్ సునీతతో చర్చలు కూడా జరిపారని టాక్ నడుస్తోంది. మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కడపలో ఒకటి. పైగా అభివృద్ధి పనులు చేపడితే ప్రజలు పవన్ వైపు తిరగడం అంత కష్టమేమి కాదు. ఈ నేపథ్యంలోనే పవన్ కడపను టార్గెట్ చేశారని.. తన మార్క్ పాలనతో కంచుకోటలో వైసీపీని మరింత బలహీనపరిచే విధంగా పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి కడపతో పాటు వైసీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న విశాఖ, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, విజయనగరం జిల్లాలపై సైతం పవన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.