తిరుపతి వేదికగా గురువారం నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెలరేగిపోయారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏడు అంశాలతో కూడిన వారాహి డిక్లరేషన్ ను ప్రకటించారు. సనాతన ధర్మాన్ని అవహేళన చేసి మాట్లాడిన వారిని ఏకిపారేస్తారు. సనాతన ధర్మానికి భంగం కలిగితే బయటకు వచ్చి పోరాటం చేస్తానని, అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తానని పవన్ కుండబద్దలు కొట్టారు.
నేను నిజమైన సనాతనవాదిని, నేను సనాతన హిందువును, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, హిందూ మతాన్ని పాటిస్తానన్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కు వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం అనేది వైరస్ లాంటిది, ఈ మహమ్మారిని నిర్మూలించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ తాజాగా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
`ఇటీవలె ఓ తమిళ యువ నాయకుడు సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చాడు. తిరుమల బాలాజీ సాక్షిగా చెబుతున్నాను. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. దాన్ని నిర్మూలించాలనుకుంటే వారే తుడిచిపెట్టుకుని పోతారు` అంటూ ఉదయనిధికి పవన్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు తన మాటలుఅర్థం అయ్యేలా తమిళంలో ఒకసారి, ఇంగ్లీష్ లో ఒకసారి పవన్ ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానుల నుంచి మినహా.. మిగితా వారిందరి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మరి తమిళ తంబీలు మరియు స్టాలిన్ పార్టీ నేతలు పవన్ సనాతన ధర్మం కామెంట్స్ పై ఎలా స్పందిస్తారో చూడాలి.
ఎవడో తమిళ్లోడికి, గుణపం దింపాడు.🤙🤙
AP Deputy CM @PawanKalyan garu.🔥🔥🔥 pic.twitter.com/eLB9oRw7CA
— JanaSena Samhitha (@JSPSamhitha) October 3, 2024