‘వారాహి విజయాత్ర’ పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా పిఠాపురంలో నిర్వహించిన సభలో సీఎం పదవి చేపట్టేందుకు తాను సిద్దంగా ఉన్న విషయాన్ని స్పష్టం చేయటం తెలిసిందే. పర్యటన ప్రారంభమైన నాలుగు రోజులకు.. అది పిఠాపురం సభ తర్వాత వైసీపీ నేతల నుంచి కౌంటర్లు ఎక్కువ కావటం కనిపిస్తోంది.
కత్తిపూడి సభ జిరిగిన వెంటనే.. తక్షణ స్పందనగా మాజీ మంత్రి పేర్ని నాని.. మంత్రి అంబటి రాంబాబు.. ఆ తర్వాత మరో మాజీ మంత్రి కొడాలి నానిలు స్పందిస్తే.. పిఠాపురం సభ తర్వాత మాత్రం మంత్రులు బొత్స సత్యానారాయణ.. దాడిశెట్టి రాజా.. సీదిరి అప్పలరాజులు మాట్లాడారు.
వారి మాటల్లో డోసు బాగా పెంచి పవన్ పై పలు విధాలుగా విమర్శలు చేయటం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. పవన్ ను టార్గెట్ చేసిన వైసీపీ మంత్రుల వాదనల్లో లాజిక్ కంటే కూడా.. ఆయన్నుఏదోలా నిందించాలన్న ధోరణే ఎక్కువగా కనిపిస్తోంది. సీదిరి అప్పలరాజు మాటల్నే తీసుకుంటే.. ఆయన ప్రతి మాటకు కౌంటర్లు పడిపోతున్నాయి. ఇంత పేలవంగా పవన్ ను టార్గెట్ చేయటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.
ఉదాహరణకు ఆయన నోటి నుంచి వచ్చిన నాలుగు వ్యాఖ్యల్ని తీసుకుంటే.. ఆయన ఎలాంటి కసరత్తు లేకుండా పవన్ కు పంచ్ లు వేసే ప్రోగ్రాంలోకి దిగినట్లు అర్థమవుతుంది. ఆయన మాటల్లోని డొల్లతనం పుణ్యమా అని.. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతిమాటకు కౌంటర్లు వేసేస్తున్నారు జనసైనికులు. వారి కౌంటర్లు కన్వీన్స్ అయ్యేలా ఉండటం గమనార్హం. సీదిరి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్నే చూస్తే..
1. ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇవ్వాలే తప్ప.. ముష్టి అడిగితే వచ్చేది కాదు
కౌంటర్: 2019 ఎన్నికల వేళలో ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. మీ బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండన్న మాటల్ని సాక్ష్యాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడిగినప్పుడు.. సీఎం పదవి ప్రజలు ఇవ్వాలే కానీ.. ఇలా ముష్ఠి అడగకూడదన్న మాటను అంటే ఏమనేవారు? ముఖ్యమంత్రి పదవిని జగన్ అడగకుండానే ప్రజలు ఆయన చేతికి ఇచ్చేశారా?
2. తాను అసెంబ్లీకి వెళ్లడానికి ఎవరు ఆపుతారని పవన్ అంటున్నాడు. ఇంతకీ పవన్ తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు తిరుగుతున్నాడా? లేదా తన ఎమ్మెల్యేల్ని గెలిపించేందుకా?
కౌంటర్: 2014లో విశాఖలో తన పార్టీ గౌరవ అధ్యక్షురాలు కమ్ తన తల్లి విజయమ్మను గెలిపించుకోవటంలో జగన్ ఫెయిల్ అయినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్న సీదిరి లాంటోళ్లకు గుర్తుకు రాలేదా? ఆ దెబ్బకు 2019లో తల్లిని బరిలో ఉంచకుండా.. తాను మాత్రమే దిగిన జగన్ తీరును సీదిరి లాంటోళ్లు ఎందుకు ప్రశ్నించనట్లు?
2019లో మాదిరి ఆదర్శాల పేరుతో.. తాను పోటీ చేసిన రెండు చోట్ల సగటు రాజకీయ పార్టీలు చేసే పోల్ మేనేజ్ మెంట్ కు దూరంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. దాని ఫలితమే పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి. పవన్ ను ఓడించటమే లక్ష్యంగా వైసీపీ ఎంతలా జాగ్రత్తలు తీసుకున్నది తెలిసిందే. ఈసారి అందుకు భిన్నంగా తాము పోల్ మేనేజ్ మెంట్ కు సిద్ధమవుతున్నామన్న సంకేతాల్ని పవన్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవటమే కాదు.. ఎమ్మెల్యేల్ని గెలిపించుకోవటమే పవన్ లక్ష్యం.
3. పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? అన్నది క్లారిటీ ఇవ్వండి తొలుత.
కౌంటర్: సీఎం అయ్యేందుకు సిద్ధమన్నంతనే ఇంతలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాంటిది ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? లాంటి విషయాల్ని చెబితే.. ఎన్నికలు రావటానికి నెలల ముందే నిద్రలు పోకుండా ఉంచటం పవన్ కు ఇష్టం లేదు. అయినా.. పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్ని ప్రత్యర్థులు అడిగితే చెప్పాలా?
4. చెప్పులు మర్చిపోతే తెచ్చుకోవచ్చు. కానీ పార్టీ గుర్తు పోతే ఎలా? పార్టీ గుర్తు ఎక్కడ ఉందో తెలుసుకోవాలి.
కౌంటర్: చెప్పులు మర్చిపోలేదు సీదిరి. అన్నవరం గుడి దగ్గర చెప్పులు కొట్టేశారన్న మాటను పవన్ చెప్పారు. జనసేనాని నోటి నుంచి వచ్చిన మాటల్ని.. అది పాపులర్ అయిన మాటల్నే గంటల్లో మార్చేసి చెబుతున్నారు. అలాంటి మీకు ఏం చెప్పినా.. మీకు తగ్గట్లు మార్చుకోవటమే తప్పించి.. చెప్పిన విషయాన్ని చెప్పినట్లుగా గుర్తించరు కదా?
పార్టీ గుర్తు ఉంటే తప్పించి విజయం సాధించలేమన్నది మీ భయం. మాకు అలాంటివి లేవు. వచ్చే ఎన్నికల్లో అదెలానో చేతల్లో చూపిస్తాం. కాస్తంత వెయిట్ చేయ్.. అన్ని అర్థమవుతాయి.
సీఎం పదవి ప్రజలు ఇవ్వాలి..ముష్టి అడుక్కుంటే వచ్చేది కాదు – సీదిరి అప్పల్రాజు
Deyyy???????????? pic.twitter.com/6EBJywdkaJ
— ????????ã????â???????? ????ö????????à (@BharathGolla) June 17, 2023
సీఎం పదవి ప్రజలు ఇవ్వాలి..ముష్టి అడుక్కుంటే వచ్చేది కాదు – సీదిరి అప్పల్రాజు
Remember these !? ????
అమ్మా, అక్కా, తాతా, మామ్మా, చెల్లెమ్మా..
25 ఎంపీ సీట్లు ఇవ్వండమ్మా..
మీ బిడ్డని గెలిపించండమ్మా..
175/175 ఇవ్వండమ్మా..
అప్పల్రాజూ, నీకు తెలీదేమో.. దీన్నే అడుక్కోడం అంటారు ????????????
— ???????????????????? (@Divya_Mudunuri) June 17, 2023