వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వారాహి 2.0 యాత్రలో పవన్.. వలంటీర్ వ్యవస్థపై విరుచుకుపడ్డారు. తాజాగా మరోసారి స్పందించిన పవన్.. సీఎం జగన్‌కు మూడు ప్రశ్నలు సంధించారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా? అంటూ.. ఆయన నిలదీశారు. వలంటీర్ల వ్యవస్థ సంస్థాగతమా? వ్యక్తిగతమా? అని ప్రశ్నించా రు. అలాంటి వ్యవస్థకు ప్రజల డేటాను ఎలా ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే గతంలో విపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో సీఎం జగన్ ప్రజల డేటా సేకరణ, నిల్వలపై.. చేసిన సంచలన వ్యాఖ్యలను పవన్ పంచుకున్నారు. తన ట్విట్టర్‌లో ఆయా వ్యాఖ్యలను పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. దీనికి ఏమంటావు జగన్? అని ప్రశ్నించారు.
మైడియర్ వాట్సన్!
‘‘అందరి ఆందోళన ఒక్కటే.. మై డియర్ వాట్సన్!.. మీరు సీఎం అయినా కాకపోయినా డేటా గోప్యతా చట్టాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ మూడు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
1) వాలంటీర్ల బాస్ ఎవరు?
2) ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా మీరు ఎక్కడ నిల్వ చేస్తున్నారు?
3) వ్యక్తుల వ్యక్తిగత డేటాను సేకరించడానికి, స్వచ్ఛంద సేవకులకు ఎవరు అధికారం ఇచ్చారు.
4) వలంటీర్టు ప్రభుత్వం ఉద్యోగులు కానప్పుడు ఎలా సేకరిస్తున్నారు..’’ అని జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు డేటా చౌర్యంపై చేసిన వ్యాఖ్యల వీడియోను పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. మరిదీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Everyone’s concern is same .. my dear Watson!. Data privacy laws will remain the same,whether you are CM or not. So answer these basic three questions.
1) Who’s the Boss of Volunteers?
2) Where are you storing the
personal data of People of AP?
3) Who has authorised… pic.twitter.com/oWsMb04RCj— Pawan Kalyan (@PawanKalyan) July 23, 2023
నా డేటా నా హక్కు..
వాలంటీర్ వ్యవస్థపై కోర్టులో జనసేన ఛాలెంజ్!#MyDataMyPrivacy pic.twitter.com/jCoqdgCea9
— JanaSena Party (@JanaSenaParty) July 23, 2023