జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ మీద సంధిస్తున్న అస్త్రాలు ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
గతంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను, ఆ పార్టీని రాజకీయంగా ఇరుకున పెడుతున్నారు.
గతంలో పవన్ పై నానా మాటలు అంటూ రౌడీలా ప్రవర్తించిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీలో తీవ్ర కలకలం రేపింది. చాలా తెలివిగా వారి పరువును బజారున పడేశాడు పవన్?
ఆయన ఏమన్నాడంటే…
’’పవన్ ఓడిపోయాడు, మాకెక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఆయన ఏమీ చేయలేడని నోటికొచ్చినట్లు మాట్లాడాడు.
ఎలాగ మాట్లాడాడంటే…
చాలా దిగజారుడు బూతులు, పిచ్చిపిచ్చిగా తిడతా ఉంటే మా నాయకులు ద్వారంపూడి గురించి ఇలా చెప్పారు…
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట
వైసీపీ ఎమ్మెల్యే అంట
వాళ్ల తాత గారి దగ్గర నుంచి వారు పెద్ద పెద్ద రౌడీలంట
వాళ్ల దగ్గర చాలామంది క్రిమినల్స్ ఉంటారంట
నేనడిగాను ఇదంతా మన కాకినాడలోనా అనడిగాను
అవునని చెప్పారు.
వారింకా బియ్యం కూడా ఎక్స్ పోర్ట్ చేస్తారట
వారు గతంలో దొంగనోట్లు ముద్రించేవారంట
అప్పట్లో ఉన్న ఎస్పీ టీటీ నాయక్ ద్వారంపూడి పెద్దలకి చేతులకు సంకెళ్లు వేసి జీపు వెనుకాల కట్టి నడిపించాడంట.
వాళ్లు చాలా డేంజరస్ పీపుల్ వాళ్లు… ఆయన మిమ్మల్ని చాలా నీచంగా తిట్టేశాడు అని చెప్పారు అన్నాడు పవన్.
మొత్తానికి ఆ కుటుంబం వరస్ట్ అని ప్రజలకు చెప్పాలన్నది పవన్ ఉద్దేశం
దానిని తనదైన శైలిలో చెప్పాడు పవన్ కళ్యాణ్.
ఈ విషయం పవన్ చెబుతున్నంత సేపు అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు.
JanaSena Chief Sri @PawanKalyan speech about Dacoit Chandrasekhar Reddy family !! (1) #DacoitChandraSekharReddy#VarahiVijayaYatra pic.twitter.com/TZCOE5l0qW
— JanaSena Party (@JanaSenaParty) June 18, 2023
మా ఆడ పడుచులను కొట్టించావ్ చంద్రశేఖర్ రెడ్డి నువ్వు. గుర్తు పెట్టుకో ఈరోజు నుండి, నీ పతనం మొదలైంది.. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తోయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేనే కాదు.. #DacoitChandraSekharReddy#VarahiVijayaYatra pic.twitter.com/OtaKrej4nI
— JanaSena Party (@JanaSenaParty) June 18, 2023
ఇక్కొకసారి నువ్వు గానీ, నీ గుండాలు గానీ ఆడపిల్లల జోలికి వస్తే, నీ తాతకి T.T. నాయక్ ఇచ్చినట్టు నేను భీమ్ల నాయక్ ట్రీట్మెంట్ ఇస్తా. #VarahiVijayaYatra#DacoitChandraSekharReddypic.twitter.com/VI5skE7up4
— Trend PSPK (@TrendPSPK) June 18, 2023
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండతో విస్తరించిన కాకినాడ MLA 'డకాయిట్' ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కబ్జాల సామ్రాజ్యం!#DacoitChandrasekharReddy#VarahiVijayaYatra pic.twitter.com/doxo3Nphvm
— JanaSena Party (@JanaSenaParty) June 18, 2023