• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సీఎం పదవిపై మోజు గురించి పవన్ తాజా కామెంట్ ఇదే

'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

admin by admin
April 5, 2021
in Movies
0
0
SHARES
232
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న వకీల్ సాబ్ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9 ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో వకీల్ సాబ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అతి తక్కువ మందికి మాత్రమే తెలంగాణ సర్కార్ అనుమతినిచ్చిన ఈ ఈవెంట్ కు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

తన సినిమా ఫంక్షన్ లో పాల్గొని దాదాపు మూడేళ్లయిందని పవన్ అన్నారు. బండ్ల గణేశ్ లా తాను మాట్లాడలేనన్న పవన్…రాజకీయ సభల్లో మాట్లాడడం అలవాటైంపోయిందని అన్నారు. దిల్ రాజు వంటి మంచి నిర్మాత తనతో సినిమా తీయడం, వేణు శ్రీరామ్ తో పనిచేయడం అదృష్టంగా భావిస్తానన్నారు. అనుకోకుండా నటుడ్ని అయ్యానని, అలాగే సీఎం అవ్వాలన్న అభిమానుల కోరిక విషయంలోనూ అలాగే ఉంటానని అన్నారు.

వకీల్ నానీ పాల్కీవాలా తనకు స్ఫూర్తిదాయకం అన్న పవన్…అడ్వొకేట్ వృత్తిపై తనకు గౌరవం కలగడానికి ఆయనే కారణమన్నారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో మానవహక్కుల కోసం బలంగా నిలబడిన వ్యక్తి పాల్కీవాలా అన్నారు. చుండూరు దళితులను ఊచకోత కేసులో బాధితుల పక్షాన పోరాడిన భువనగిరి చంద్రశేఖర్ కూడా తనకు నచ్చిన న్యాయవాది అన్నారు పవన్.

ప్రకాశ్ రాజ్ కు, తనకు మధ్య రాజకీయ విభేదాలున్నాయని, సినిమాలపరంగా తాము ఒక్కటేనని పవన్ అన్నారు. తన గురించి ప్రకాశ్ రాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటిని తాను గౌరవిస్తానని అన్నారు. ఫ్యాన్స్ లేకుంటే తాను లేనని, వారి ఆనందం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటానని అన్నారు.  తన ప్రపంచంలో తాను బతుకుతుంటానని, అది మిగతా వాళ్లకు పొగరులా ఉంటుందని వివరించారు.

తనకు సిమెంట్ వ్యాపారాలు, పేకాట దందాలు లేవని పొలిటికల్ కామెంట్లు చేసిన పవన్…తన సినిమా వల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఇందులో ఎలాంటి అవినీతి ఉండదని, భగవంతుడు కరుణించినంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన పవన్ కల్యాణ్…ప్రముఖ డ్రమ్మర్ శివమణితో కలిసి డ్రమ్స్ వాయించడం ఈ ఈవెంట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Tags: actorcmpawan kalyanpawan kalyan speechpre release eventvakeel saab
Previous Post

డ్రగ్స్ కేసు..కేసీఆర్ కు బండి సంజయ్ వైట్ ఛాలెంజ్

Next Post

జగన్ కాళ్లు నొక్కే వ్యక్తిని గెలిపిస్తే…22 గొర్రెలకు మరో గొర్రె తోడవుతుంది

Related Posts

legend k viswanath
Movies

అలా ఆపేయడమే కె.విశ్వనాథ్ ప్రత్యేకత

February 3, 2023
Movies

కల్యాణ్ రామ్ ‘అమిగోస్’…అదిరింది!

February 3, 2023
Trending

పవన్ 3 పెళ్లిళ్లపై బాలయ్య వార్నింగ్

February 3, 2023
legend k viswanath
Movies

శంకరాభరణం విడుదల రోజునే తుదిశ్వాస విడవటమా?

February 3, 2023
k viswanath
Movies

కె.విశ్వనాథ్ : కళా తపస్సు ముగిసింది.. స్వర్గసీమకు కె.విశ్వనాథ్

February 3, 2023
Movies

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మృతి

February 2, 2023
Load More
Next Post

జగన్ కాళ్లు నొక్కే వ్యక్తిని గెలిపిస్తే...22 గొర్రెలకు మరో గొర్రె తోడవుతుంది

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అలా ఆపేయడమే కె.విశ్వనాథ్ ప్రత్యేకత
  • కల్యాణ్ రామ్ ‘అమిగోస్’…అదిరింది!
  • సచివాలయంలో అగ్నిప్రమాదం? షర్మిల, పాల్ సెటైర్లు
  • వివేకా కేసు..సజ్జల భలే కవర్ చేశాడే!
  • పవన్ 3 పెళ్లిళ్లపై బాలయ్య వార్నింగ్
  • నెల్లూరు రెబల్స్ ఎపిసోడ్ పై రఘురామ కామెంట్స్
  • ఎన్ కౌంటర్ చేస్తేనే నా నోరు మూతపడుతుంది:కోటంరెడ్డి
  • సోము మళ్లీ ఏసేశాడుగా.. ఈసారి జనసేనాని టార్గెట్
  • కళాతపస్వి సినిమాలు ఎందుకు ప్రత్యేకం?
  • శంకరాభరణం విడుదల రోజునే తుదిశ్వాస విడవటమా?
  • కె.విశ్వనాథ్ : కళా తపస్సు ముగిసింది.. స్వర్గసీమకు కె.విశ్వనాథ్
  • మా ఇద్దరి గురించి మాట్లాడితే..‘డొక్క పగలదీసి డోలు కడతాం’
  • కోటంరెడ్డిపై వేటు…ఆదాలకు అందలం
  • పెద్దిరెడ్డి ఇలాకాలో లోకేష్ యాత్ర…ఉద్రిక్తత
  • టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు మృతి

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra