ప్రతిపక్షంలో ఉండటం కష్టం కాదు, అవకాశం. నేతలు మరింత దృఢంగా తయారయ్యేది ప్రతిపక్షంలో ఉన్నపుడే సాధ్యం. జగన్ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండగా రాటుదేలి ఈరోజు సీనియర్ నాయకులను కూడా తన కంట్రోల్లో పెట్టుకుని రాజకీయం నెరపుతున్నారు.
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడే వ్యూహాల్లో దిట్టగా ఎదిగారు. కేసీఆర్ ఉద్యమంలో సుమారు 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో జనంలో ఉన్నపుడే రాటుదేలారు.
ఇపుడు లోకేష్ కు అయినా, పరిటాల శ్రీరామ్ కి అయినా ప్రతిపక్షంలో ఉండటం ఆవేదన కాదు అవకాశం. ఇది నేర్చుకునే సమయం. నిజమే…. ప్రతిపక్షంలోకి వచ్చాక లోకేష్ తనను తాను ఎంతోమార్చుకున్నారు. తీర్చిదిద్దుకున్నారు. భాష మార్చుకున్నారు. ఏడాదిన్నరలో ఎంతో మెరుగయ్యారు. అదే బాటలో పరిటాల శ్రీరాం కూడా నడుస్తున్నారు. ఎప్పటికపుడు తనను తాను తీర్చిదిద్దుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం నేతలతో మీటింగ్ సందర్భంగా జాగ్రత్తగా చంద్రబాబు సూచనలను నోట్ చేసుకుంటున్న చిత్రాలివి.