సిక్కోలు జిల్లాలో కీలకమైన పలాస వైసీపీ రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. ఇక్కడ మంత్రి సీదిరి అప్పలరాజుకు వ్యతిరేకంగా నాయకులు కూటమి కట్టారు. ఆయనకు వ్యతిరేకంగా.. ఏకంగా.. సీఎం జగన్ కే ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మంత్రి ఏకపక్ష ధోరణిని నాయకులు నిరసిస్తున్నారు. సీనియర్ల ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. అసలు వారికి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని.. నాయకులు పేర్కొంటున్నా రు. ఆయననుపొరపాటున గత ఎన్నికల్లో ఎన్నుకున్నామని కూడా వారు ఆవేదన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి సీదిరికి వ్యతిరేకంగా.. కొందరు నాయకులు రహస్యంగా భేటీ కావడం.. గమనార్హం. వాస్తవానికి ఇప్పటి వరకు సిక్కోలు రాజకీయాల్లో పార్టీ ఏదైనా..కూడా నాయకులకు, అందునా మంత్రిస్థా నంలో ఉన్న వారికి వ్యతిరేకంగా కూటమి కట్టడం.. వారిపై విమర్శలు చేయడం.. ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేసే పరిస్థితికి రావడం వంటివి లేనేలేవు. అలాంటిది తొలిసారి ఎమ్మెల్యే కమ్ మంత్రి కూడా అయిన.. సీదిరి వ్యతిరేకంగా నాయకులు కూటమి కట్టే పరిస్థితి రావడం.. చర్చకు దారితీసింది.
వాస్తవానికి సీదిరి వైసీపీలో ఎంతో సీనియర్ నేత కాదు. ఆయనకన్నా.. సీనియర్లు.. జెండా మోసిన వారు.. పార్టీ కోసం.. ఆస్తులు అమ్ముకుని ప్రచారం చేసినవారు.. జగన్ వెంట పాదయాత్రలు చేసిన వారు చాలా మంది ఉన్నారు. అయితే..లక్కు కలిసి వచ్చి .. సీదిరికి టికెట్ దక్కింది.. ఆతర్వాత.. కూడా ఎంతో మంది సీనియర్లను పక్కన పెట్టి మరీ.. ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు. అయినంత మాత్రాన తానే సూపర్ మ్యాన్ అనేలా .. వన్ మ్యాన్ షో నిర్వహిస్తుండడమే ఇప్పుడు వివాదానికి దారితీసింది.
వాస్తవానికి సీఎం జగన్ అంతటి వారే.. అందరికీ వాల్యూ ఇస్తున్నారు. ఎవరు ఏం చెప్పినా వింటున్నారు. కిందిస్థాయిలోనూ అదే జరగాలని కోరుకుంటున్నారు.కానీ, సీదిరి మాత్రం.. అలా చేయడం లేదు. ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారన్న టాక్ ఉంది. అసలు ఆయన ఒక మంత్రిగా హుందాగా వ్యవహరించడం లేదనే వాదన కూడా పార్టీలో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు అప్పుడే అసమ్మతి సెగలు పొగలు పెరిగిపోయాయి. తాజాగా అసమ్మతి వర్గం ప్రత్యేకంగా భేటీ అయింది.
వీరిలో సీనియర్ కౌన్సిలర్, పట్టణ వైసీపీ అధ్యక్షుడు దువ్వాడ శ్రీకాంత్, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ హేమ్బాబు చౌదరి, జుత్తు నీలకంఠం, నిరంజన్ పలాస, కాశీబుగ్గ మునిసిపాలిటీ ననేతలు పాల్గొన్నారు. త్వరలోనే జరగనున్న నియోజకవర్గం సమీక్షా సమావేశంలో మంత్రి బాగోతాన్ని అధిష్టానం ముందు పెట్టాలని నాయకులు నిర్ణయించారు. తమను అసలు పట్టించుకోని తీరును.. సీదిరి నియంతృత్వ పోకడలను కూడా.. జగన్‌కు వివరించాలని నిర్ణయించారు. అంతేకాదు.. వైసీపీకి అనుకూలంగా ఉంటామని. కానీ.. సీదిరి పక్షాన మాత్రం తాము నిలవబోమని పేర్కొన్నారు. మొత్తానికి ఈ పరిణామాలు.. సీదిరికి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయనడంలో సందేహం లేదు.