బిల్ గేట్స్ మోసపోయాడు. అది చిన్న మోసం ఏమీ కాదు. ఒక పాకిస్తానీ చేతిలో బిల్ గేట్స్ మోసపోయాడు.
బిల్ గేట్స్ లాంటి వ్యాపార దిగ్గజాన్ని అంత సులువుగా ఎలా మోసం చేశాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మోసం జరిగింది ఈరోజు కాదులేండి.
తాజాగా సైమన్ క్లార్క్.. విలో లోచ్ అనే ఇద్దరు రచయితలు తాము రాసిన పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
బిల్ గేట్స్ దాన గుణాన్ని ఆసరా చేసుకుని పాక్ వ్యాపారి ఆరిఫ్ నఖ్వీ దాదాపు రూ.743 కోట్ల మేర మోసం చేశాడట. ఈ విషయాన్ని ‘‘ది కీ మ్యాన్: ది ట్రూ స్టోరీ ఆఫ్ హౌ ది గ్లోబల్ ఎలైట్ వాజ్ డూప్డ్ బై ఎ క్యాపిటలిస్ట్ ఫెయిరీ టేల్‘‘ లో పేర్కొన్నారు.
అయితే, గేట్స్ తో పాటు చాలామంది బాధితులు ఉన్నారట.
చీటర్ నఖ్వీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుని వ్యాపారవేత్తగా ఎదిగారు. అబ్రాజ్ గ్రూప్ కంపెనీని స్టార్ట్ చేశాడు. 118 మిలియన్ డాలర్లతో కంపెనీ పెట్టాడు. తాను పేదరికాన్ని రూపుమాపే ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. దానిలో పాల్గొన్న 250 మంది ముస్లిం వ్యాపారవేత్తల్లో నఖ్వీ ఒకరు.
లండన్ స్కూల్ స్టూడెంట్ కదా మాటలు బాగా నేర్చాడు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే పెట్టుబడులు.. శిక్షణ.. ఉపాధి కల్పన అంశాలపై అతనిచ్చిన లెక్చర్ అదిరిపోయింది.
అమెరికా సైతం అతని సంస్థల్లో 150 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. పలు వర్సిటీలకు కోట్ల రూపాయిల విరాళాలు ఇచ్చిన అతను.. గేట్స్ ఫౌండేషన్ మాదిరే అమన్ ఫౌండేషన్ స్థాపించారు.
మంచి ఎర వేసి 2017లో బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటుచేశాడు. అది కూడా న్యూయార్కులో. దీనికి పారిశ్రామికవేత్తలు హాజరు కావాలని కోరారు. ప్రపంచంలోని సంపన్నులు అయిన బిల్ గేట్స్.. క్లింటన్ లాంటి వాళ్లను కలిశాడు. నఖ్వీ చురుకుదనం నచ్చటంతో గేట్స్ తన ఫౌండేషన్ నుంచి 100 మిలియన్ డాలర్లను సాయంగా ఇచ్చారు.
అంతా బాగానే సాగింది. కానీ అతను చెప్పిన పనులు ఏమీ చేయడం లేదు. నిదులు సమీకరణ అయ్యే వరకు మాత్రమే చేశాడు. ఆ తర్వాత మానేశాడు. నిధుల్ని దుర్వినియోగం చేస్తున్న విషయం ఎలా బయటకు వచ్చిందంటే… అతడి కంపెనీలో పని చేసే ఉద్యోగి ఒకరు ఈ మొయిల్ రూపంలో అతని పెట్టుబడిదారులకు మెయిల్ రాశారు. దీంతో నఖ్వీ బండారం బయటపడింది. 2019 ఏప్రిల్ 10న హీత్రో ఎయిర్ పోర్టులో అతన్ని అరెస్టుచేశారు. గేట్స్ నే బురిడీ కొట్టించిన ఈ యవ్వారం తాజా పుస్తకం వల్ల బయటకు వచ్చింది.