మన దాయాది దేశం పాకిస్థాన్ ప్రజలు.. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ జపం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. భారత దేశాన్ని గత 9 ఏళ్లుగా పాలిస్తున్న నరేంద్ర మోడీ తమకు కావా లంటూ.. ఓ పాకిస్థాన్ యువకుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ నానా విధాల సమస్యల్లో ఉంది. అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత.. ఆర్థిక సమస్యలు కారణంగా ప్రజలు నానా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో దేశాన్ని బాగుచేయాలంటే మోడీని తమకు ఇవ్వాలంటూ ఓ పాకిస్థానీ యువకుడు ప్రార్ధన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థానీ యూ ట్యూబర్ సనా అమ్జద్ ఈ వీడియో పోస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి బతికుండగానే పారిపోండి, అవసరమైతే భారత్‌కైనా వెళ్లిపోండి అనే నినాదాలు పాకిస్థాన్ వీధుల్లో వినపడుతున్నాయని, దీనిపై స్పందన చెప్పాలని సనా అమ్జద్ ఓ యువకుడిని కోరారు.
దీనికి సదరు యువకుడు జవాబిస్తూ తమకు నవాజ్ షరీఫ్ వద్దని, ఇమ్రాన్ ఖాన్, బెనజీర్, జనరల్ ముషారఫ్ వద్దని, కేవలం మోడీ కావాలన్నాడు. పాకిస్థాన్‌లో ప్రస్తుతం ధరలన్నీ ఆకాశానికంటాయి. ముఖ్యంగా ఐఎంఎఫ్ ఇటీవల కఠిన ఆంక్షలు విధించాలని షరతులు విధించింది. ఇవి వచ్చే మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు కనీస అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చే పరిస్తితి కనిపించడం లేదు.
పాకిస్థాన్‌ను మోడీ కనుక పాలిస్తే.. తమ పరిస్థితి బాగుంటుందనే అభిప్రాయం పాక్ ప్రజల్లోకనిపిస్తుండడం గమనార్హం. మొత్తానికి ఈ పరిణామం..అంతర్జాతీయంగా.. కూడా చర్చకు దారితీసింది. మరోవైపు.. పాకిస్థా న్ను ఆదుకునేందుకుఅనేక మార్గాలు అవలంభించామన్న.. ఐఎంఎఫ్.. ఇప్పుడు ఏమైనా ఉంటే.. ఆదేశమే చేసుకోవాలని..పేర్కొనడం గమనార్హం.