బాడీ పెయిన్స్ తో పాటు.. కొన్ని ప్రత్యేక అంశాలకు మెడిసిన్స్ మీద ఏ మాత్రం అవగాహన ఉన్నా వాడే కొద్ది మందుల్లో మెఫ్తాల్ ఔషధం ఒకటి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మెడిసిన్ గురించి షాకింగ్ నిజాన్ని వెల్లడించింది. అంతేకాదు.. ఈ మందును వాడొద్దని స్పష్టం చేసింది. ఒకవేళ.. వాడితే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న వివరాల్ని తెలియజేస్తూ వార్నింగ్ ఇచ్చింది.
నొప్పి నివారణకు వినియోగించే మెఫ్తాల్ ఔషధానికి సంబంధించి ప్రతికూల ప్రభావాల్ని పర్యవేక్షించాలని ఆరోగ్య రంగ నిపుణులు.. రోగులకు సూచనలు చేస్తూ అడ్వైజరీనోట్ ను విడుదల చేశారు. ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రాం ఆఫ్ ఇండియా డేటాబేస్ ప్రాథమిక విశ్లేషణలో ఈ ఔషధాన్ని వాడితే.. ఇసినోఫిలియా.. సిస్టెమిక్ సింప్టమ్స్ సిండ్రోమ్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మెడిసిన్ ను వాడే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
అంతేకాదు.. ఎవరైనాఈ మెడిసిన్ కారణంగా ఏదైనా దుష్ప్రభావాలు ఎదురైతే పీవీపీఐ హెల్ప్ లైన్ 18001803024 నెంబరుకు తెలియజేయాలని పేర్కొంది. అంతేకాదు.. www.ipc.gov.in వెబ్ సైట్ కు సమాచారాన్ని ఇవ్వాలని తెలియజేసింది. ఈ మెడిసిన్ ను చాలామంది రుమటాయిడ్ ఆర్థైయిటిస్.. ఆస్టియో ఆర్థైయిటిస్.. మహిళల్లో మంత్లీ సైకిల్ వేళలో వాడుతుంటారు. అంతేకాదు.. రక్తస్రావం.. జ్వరం.. దంతాల నొప్పి నివారణ చికిత్సలో భాగంగా మెఫేనమిక్ యాసిడ్ పెయిన్ కిల్లర్ సూచిస్తుంటారు. సో.. మెఫ్తాల్ వాడే వేళ.. జాగ్రత్తగా ఉండాలో తాజా ప్రకటన స్పష్టం చేస్తుందని చెప్పాలి.