బాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనల్ ల కాంబినేషన్లో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆది పురుష్. జూన్ 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడంపై తిరుమలవాసులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈవెంట్ సందర్భంగా జైశ్రీరామ్ అంటూ నినాదాలు తిరుపతిలో మార్మోగాయి. అయితే, పవిత్రంగా ఈవెంట్ నిర్వహించిన చిత్ర యూనిట్…దర్శకుడు ఓం చేసిన పనితో వివాదంలో చిక్కుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం హీరోయిన్ కృతి సనన్ ను దర్శకుడు ఓం కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్న ఘటన వివాదానికి దారి తీసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గుడి బయట కృతిని హగ్ చేసుకుని ఓం ముద్దు పెట్టుకున్నారు.
దీంతో పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఇటువంటి పనులు చేయడం ఏమిటని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో ఇటువంటి పనులు చేయడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పిక్నిక్, షూటింగ్ స్పాట్ కాదని అన్నారు. స్వామివారి అర్చన సేవలో పాల్గొన్న తర్వాత ఆలయ మహాద్వారం దగ్గర ఇటువంటి పనులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
అయితే, కృతికి ఫ్లైట్ టైం అవుతోందని, ఈ నేపథ్యంలోనే ఆమె హడావిడిగా బయలుదేరుతున్న సందర్భంగా. ఓం హగ్ చేసుకున్నారని అంటున్నారు. కానీ, హిందువుల మనోభావాలను ఓం దెబ్బతీశారని, ఆయన తక్షణమే భక్తులకు, హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.