ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా జగన్ అలివిగాని అడ్డగోలు హామీలిచ్చిన సంగతి తెలిసిందే. జనాన్ని నమ్మించి ఓట్లు కొల్లగొడితే చాలనుకున్న జగన్….నవరత్నాలంటూ సంక్షేమ పథకాల పేరుతో ఒక్క చాన్స్ అంటూ ఓట్లడిగారు. ఆ హామీల్లో భాగంగానే..అవ్వా, తాతల పెన్షన్లను మూడు వేలు చేస్తానన్న జగన్…మాట తప్పారు. తూచ్ తాను అలా అనలేదని….బుకాయించారు.
పెన్షన్ లను ఒక్కసారిగా 3 వేలు చేస్తానని చెప్పలేదని, 2వేల రూపాయల నుంచి పెంచుకుంటూ…పోతానని చెప్పానని మాట తప్పి మడమ కూడా తిప్పారు. ఇక, అర్హులైన వారందరికీ అతి తక్కువ సమయంలోనే పెన్షన్ మంజూరు చేస్తానని చెప్పిన జగన్….వంద మంది కొత్తవారికి పెన్షన్ ఇచ్చి…వెయ్యిమంది అర్హులకు పెన్షన్ కట్ చేస్తున్నారు. అంతేకాదు, అనర్హులకు అందలం వేయడంతోపాటు…అర్హులైన వేలాది మంది పెన్షన్లకు కోత పెట్టిన ఘనత జగన్ దే.
ఇక, రకరకాల కారణాలు చెప్పి వందలాది మంది వృద్ధుల పెన్షన్లను జగన్ సర్కార్ నిలిపివేసిన ఘటనలు అనేకమున్నాయి. కేవలం ఆ పెన్షన్ పై ఆధారపడిన ఎందరో అవ్వాతాతల నోటికాడ కూడును జగన్ లాగేయడంపై విమర్శలు కూడా వచ్చాయి. గతంలో అన్యాయంగా తన పెన్షన్ ను నిలిపివేశారంటూ ఓ అవ్వ హైకోర్టు మెట్లెక్కగా…చివరకు హైకోర్టులో జగన్ సర్కార్ పై ఆమె విజయం సాధించింది. కోర్టుతో జగన్ సర్కార్ కు మొట్టికాయలు వేయించి తనకు రావాల్సిన పెన్షన్లను బకాయిలతో సహా ముక్కుపిండి వసూలు చేసుకుంది.
ఇక, తాజాగా తాము వేలాది మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్…తన సొంతజిల్లా కడపలో మాత్రం ఓ పండు ముసలావిడకు పెన్షన్ కట్ చేశారు. కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠానికి చెందిన ఓ ముసలమ్మ తనకు పెన్షన్ కట్ చేశారని కన్నీటి పర్యంతమవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెన్షన్ రాకపోతే తాన పస్తులుండాల్సిందేనంటూ ఆ అవ్వ రోదిస్తూ పెన్షన్ ఇప్పించమని కోరుతున్న వైనం కంటతడిపెట్టించింది.
‘‘నేనేం పనిచేయలేను..ముసినిదాన్ని…పె
CMసొంతజిల్లా కడపజిల్లా,మైదుకూరునియోజకవర్గం,బ్రహ్మంగారిమఠంకు చెందిన ఈ ముసలమ్మకు పెన్షన్ ఆపేసిన ప్రభుత్వం.పెన్షన్ పైనే జీవనం సాగిస్తున్న ఈమె రోదిస్తూ పెన్షన్ ఇప్పించమని కోరుతుంది.ప్రతిఒక్కరూతమబాధ్యతగా తీసుకొనిఈవీడియోని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసి ప్రభుత్వందృష్టికితీసుకొచ్చి pic.twitter.com/yzGh7tkapO
— Nalluri MuraliKrishna (@NalluriMuraliK8) August 1, 2022
Comments 1