• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ అవ్వ కన్నీళ్లు జగన్ గుండెను కరిగిస్తాయా?

NA bureau by NA bureau
August 2, 2022
in Andhra, Politics, Top Stories, Trending
1
0
SHARES
145
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా జగన్ అలివిగాని అడ్డగోలు హామీలిచ్చిన సంగతి తెలిసిందే. జనాన్ని నమ్మించి ఓట్లు కొల్లగొడితే చాలనుకున్న జగన్….నవరత్నాలంటూ సంక్షేమ పథకాల పేరుతో ఒక్క చాన్స్ అంటూ ఓట్లడిగారు. ఆ హామీల్లో భాగంగానే..అవ్వా, తాతల పెన్షన్లను మూడు వేలు చేస్తానన్న జగన్…మాట తప్పారు. తూచ్ తాను అలా అనలేదని….బుకాయించారు.

పెన్షన్ లను ఒక్కసారిగా 3 వేలు చేస్తానని చెప్పలేదని, 2వేల రూపాయల నుంచి పెంచుకుంటూ…పోతానని చెప్పానని మాట తప్పి మడమ కూడా తిప్పారు. ఇక, అర్హులైన వారందరికీ అతి తక్కువ సమయంలోనే పెన్షన్ మంజూరు చేస్తానని చెప్పిన జగన్….వంద మంది కొత్తవారికి పెన్షన్ ఇచ్చి…వెయ్యిమంది అర్హులకు పెన్షన్ కట్ చేస్తున్నారు. అంతేకాదు, అనర్హులకు అందలం వేయడంతోపాటు…అర్హులైన వేలాది మంది పెన్షన్లకు కోత పెట్టిన ఘనత జగన్ దే.

ఇక, రకరకాల కారణాలు చెప్పి వందలాది మంది వృద్ధుల పెన్షన్లను జగన్ సర్కార్ నిలిపివేసిన ఘటనలు అనేకమున్నాయి. కేవలం ఆ పెన్షన్ పై ఆధారపడిన ఎందరో అవ్వాతాతల నోటికాడ కూడును జగన్ లాగేయడంపై విమర్శలు కూడా వచ్చాయి. గతంలో అన్యాయంగా తన పెన్షన్ ను నిలిపివేశారంటూ ఓ అవ్వ హైకోర్టు మెట్లెక్కగా…చివరకు హైకోర్టులో జగన్ సర్కార్ పై ఆమె విజయం సాధించింది. కోర్టుతో జగన్ సర్కార్ కు మొట్టికాయలు వేయించి తనకు రావాల్సిన పెన్షన్లను బకాయిలతో సహా ముక్కుపిండి వసూలు చేసుకుంది.

ఇక, తాజాగా తాము వేలాది మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్…తన సొంతజిల్లా  కడపలో మాత్రం ఓ పండు ముసలావిడకు పెన్షన్ కట్ చేశారు. కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠానికి చెందిన ఓ ముసలమ్మ తనకు పెన్షన్ కట్ చేశారని కన్నీటి పర్యంతమవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెన్షన్ రాకపోతే తాన పస్తులుండాల్సిందేనంటూ ఆ అవ్వ రోదిస్తూ పెన్షన్ ఇప్పించమని కోరుతున్న వైనం కంటతడిపెట్టించింది.

‘‘నేనేం పనిచేయలేను..ముసినిదాన్ని…పెన్షన్ మీదే ఆశలుపెట్టుకున్నా…కానీ, పెన్షన్ కూడా తీసేస్తున్నారు…దయ ఉంచి పెన్షన్ ఇప్పించండి…నాకు భర్త లేరు…కొడుకుల్లేరు…ఎవ్వరు లేరు..ఒక్కదాన్నే…మీ దయ.. పెన్షన్ ఇప్పించండి’’ అంటూ దీనంగా ఆమె రోదిస్తూ అడిగిన వైనం పలువురిని కంటతడిపెట్టించింది. మరి, ఆ అవ్వ కన్నీళ్లు చూసైనా జగన్ గుండె కరుగుతుందేమో వేచి చూడాలి.

CMసొంతజిల్లా కడపజిల్లా,మైదుకూరునియోజకవర్గం,బ్రహ్మంగారిమఠంకు చెందిన ఈ ముసలమ్మకు పెన్షన్ ఆపేసిన ప్రభుత్వం.పెన్షన్ పైనే జీవనం సాగిస్తున్న ఈమె రోదిస్తూ పెన్షన్ ఇప్పించమని కోరుతుంది.ప్రతిఒక్కరూతమబాధ్యతగా తీసుకొనిఈవీడియోని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసి ప్రభుత్వందృష్టికితీసుకొచ్చి pic.twitter.com/yzGh7tkapO

— Nalluri MuraliKrishna (@NalluriMuraliK8) August 1, 2022

Tags: cm jaganold age pensionsold woman crying for pensionpension removed in appensions for old peoplerules for pensionysr pension in ap
Previous Post

ఓడినా 2025 వరకు అవి వైసీపీ చేతిలో ఉండేలా ప్లాన్

Next Post

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ నిర్ణయం

Related Posts

Top Stories

రామోజీతో అమిత్ షా భేటీ..నేరుగా ఫిలింసిటీకి

August 20, 2022
Movies

కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్

August 19, 2022
Trending

జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్

August 19, 2022
gorantla madhav
Top Stories

రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్

August 19, 2022
Trending

గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు

August 19, 2022
Movies

ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ

August 19, 2022
Load More
Next Post

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ నిర్ణయం

Comments 1

  1. Pingback: ఆ అవ్వ కన్నీళ్లు జగన్ గుండెను కరిగిస్తాయా? - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • రామోజీతో అమిత్ షా భేటీ..నేరుగా ఫిలింసిటీకి
  • కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్
  • జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్
  • రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్
  • గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు
  • ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ
  • పలాసలో హైటెన్షన్..టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్
  • టీడీపీ పోరాటంతో అనంతబాబుకు షాక్
  • తమ ఎమ్మెల్యేపై మాజీ మంత్రి అనిల్ ఫైర్
  • కురుబలకు జగన్ ఇచ్చిన స్థానం ఇది…ట్రోలింగ్
  • కొడాలి నాని బూతులపై బండ్ల గణేష్ ఫైర్
  • బాలయ్యను టార్గెట్ చేసిన రోజా
  • జిమ్ పై సీఐడీ చీఫ్ సునీల్ షాకింగ్ కామెంట్స్
  • పవన్ కు కొడాలి నాని సవాల్
  • ఆ సినిమా దెబ్బకు ఇల్లు అమ్ముకున్న స్టార్ హీరో?

Most Read

పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి!

టీడీపీ నుంచి కళా వెంక‌ట్రావు సస్పెండ్?

కవర్ చేస్కోలేక రష్మిక తిప్పలు..ట్రోలింగ్

వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే…

అనసూయ అంత మాటనేసిందేంటి?

జగనన్న నుంచి తెలుగుకు స్వాతంత్ర్యం ఎప్పుడు?..ట్రోలింగ్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra