నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యుల పై జరిగిన హేయమైన మాటల దాడికి నిరసనగా అమెరికా లోని ఒహాయో రాష్ట్రం లో ఉన్న ప్రవాసాంధ్రుల సమైక్య సమావేశం.
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ లో 19 -11-21 శుక్రవారం జరిగిన జుగుప్సాకరమైన సన్నివేశాన్ని ఒహాయో రాష్ట్రం కొలంబస్ లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు తీవ్రంగా నిరసిస్తూ ఖండించారు. పలువురు తెలుగు N R I ప్రముఖులు ఈ సందర్భంగా ‘బావర్చీ’ లో సమావేశమై బాధిత కుటుంబ సభ్యులకు తమ సంఘీభావం తెలిపారు.
బాలాజీ కొడాలి గారు మాట్లాడుతూ అందరూ దీని పై స్పందించాలని కోరారు.
జగదీష్ ప్రభల గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం లోని ఆడవారి పై నిందలు వేయడాన్ని ఉద్వేగంగా దుయ్యబట్టారు.
వేణు పసుమర్తి గారు మాట్లాడుతూ ఆడు వారిని గౌరవించడం మన సంస్కృతి అని జరిగినదానికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
శ్రీనివాస్ సంగా గారు మాట్లాడుతూ జరిగిన సంఘటన హేయమని అందరూ దీనిని ప్రతిఘటించాలన్నారు.
విజయ కృష్ణ యడ్లపల్లి గారు మాట్లాడుతూ 19-11-21 శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రజలకు ‘దుర్దినం’
రాష్ట్ర శాసనసభ లో జరిగిన జుగుప్సాకరమైన సంఘటనను మనిషిగా పుట్టిన ప్రతివారు ప్రతిఘటించాలన్నారు పాలక పక్షం వారు సభలో మాట్లాడిన మాటలకు సమాజం సిగ్గుతో తల దించుకొనే లాగా వున్నదని, చట్టాలు చేసే సభలో చట్టమంటే లెక్కలేని వారు కూర్చుంటే ఇంత కంటే ఏముంటుందని, వారికి ఓట్లేసి ఆ సభలో కూర్చోబెట్టిన వారు కూడా ఈ స్థితికి బాధపడుతున్నారనీ, ‘శ్రీమతి భువనేశ్వరి’ రామారావు గారి కూతురో, చంద్ర బాబు నాయుడు గారి భార్యో అని చూడ వద్దు ఆమె ఒక స్త్రీ మూర్తి మన ఆడ పడుచు.
భారత దేశం లోనే కాదు ప్రపంచం లో ‘స్త్రీ’ లకున్న గౌరవం, ప్రాధాన్యత ఇంకెవ్వరికి లేవనీ, సమాజంలో ‘స్త్రీ’ తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా తన స్థానాన్ని కాపాడుకుంటుందనీ, మన పురాణాలలో స్త్రీ పాత్రలకున్న గౌరవం చాల గొప్పదనీ, సీత, ద్రౌపది వంటి పతివ్రతలను వేధించి హింసించిన వారు బంధు మిత్ర పరివారముతో సహా నాశనమై పోయారో వివరించారు.
“మహా భారతం” లోని సభా పర్వం లో “మహా దారుణ మది విషము కంటె దహనము కంటే” వాక్పారుష్యం పనికిరాదని, అది విషము కంటేనూ, అగ్ని కంటేనూ కూడా దారుణమయిందని “నన్నయ” గారన్నారని చెప్పి ముగించారు.
కోటేశ్వరరావు పాతూరి గారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రెండున్నర సంవత్సరాల నుండి పరిపాలన కుంటుబడి పోయిందని, 33 వేల యకరాల భూములు రాజధాని కొరకు త్యాగం చేసిన 29 గ్రామాల రైతులు 32 వేలమంది ఉసురు తీస్తున్నారనీ, వారిని అతిదారుణంగా ఈ ప్రభుత్వం హింసిస్తున్నదన్నారు.
ఎక్కడ చూసినా భూకబ్జాలు, ఇసుక మాఫియాలు,దుండగాలు, దురాగతాలు తప్ప ప్రజాహిత కార్యక్రమాలేమీ లేవన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారన్నారు.
దోపిడీలు,మానభంగాలు మితిమీరిన వన్నారు.” ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలుంటారు” అన్న నానుడిని విస్మరించారన్నారు.
ఈ ప్రభుత్వం జారీ చేసినవి 200 లకు పైగా GO లను కోర్టులు కొట్టివేశారన్నారు.
ఫణి తేళ్ళ గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని లో భావప్రకటనా స్వేచ్చ లేకపోవటం, మానవ హక్కుల ఉల్లంఘనల పై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
నాగేశ్వరరావు మన్నె గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాలకులు తమ బాధ్యతలను విస్మరించి మంత్రుల చేత శాసన సభ్యుల చేత ప్రతిపక్షాల వారి పై దాడులు చేపిస్తున్నారన్నారు.
వేణు తలశిల గారు మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధమైన పదవులనుభవిస్తూ బాథ్యతలు విస్మరించి ఇతరుల మీద నిందలు వేయటమే పనిగా పెట్టుకున్న వై సి పి నేతలు రాజకీయాల వైపు కన్నెత్తి కూడా చూడని ” శ్రీమతి భువనేశ్వరి ” తన తండ్రి గానీ, భర్త గానీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఎటు వంటి పైరవీలు చేయకుండా తన కుటుంబము తమ వ్యాపారాలకే పరిమితమై ఉన్న ఆమెపై నిందలు వేసేవారు ఆపనిని ఆపి వారి పుట్టుక, వారి పిల్లల పుట్టుకల గుఱించి తవ్వకాలు జరుపుకుంటే మంచిదని సూచించారు.
ఈ కార్యక్రమానికి తమ సంపూర్ణ సహకారన్నందించిన శ్రీధర్ కేశాని గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.