• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఒహాయో ప్రవాసాంధ్రులు – భువనేశ్వరి పై చేసిన నీచమైన వ్యాఖ్యలను ఖండించారు   

admin by admin
November 24, 2021
in NRI
0
0
SHARES
636
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యుల పై జరిగిన  హేయమైన మాటల దాడికి నిరసనగా అమెరికా లోని ఒహాయో  రాష్ట్రం లో ఉన్న ప్రవాసాంధ్రుల సమైక్య సమావేశం.

‌ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ లో 19 -11-21 శుక్రవారం జరిగిన జుగుప్సాకరమైన సన్నివేశాన్ని ఒహాయో రాష్ట్రం కొలంబస్ లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు తీవ్రంగా నిరసిస్తూ ఖండించారు. పలువురు తెలుగు N R I ప్రముఖులు  ఈ సందర్భంగా ‘బావర్చీ’ లో సమావేశమై బాధిత కుటుంబ సభ్యులకు తమ సంఘీభావం తెలిపారు.

బాలాజీ కొడాలి గారు మాట్లాడుతూ అందరూ దీని పై  స్పందించాలని కోరారు.

జగదీష్ ప్రభల గారు మాట్లాడుతూ  చంద్రబాబు నాయుడు గారి కుటుంబం లోని ఆడవారి పై నిందలు  వేయడాన్ని ఉద్వేగంగా దుయ్యబట్టారు.

వేణు పసుమర్తి గారు మాట్లాడుతూ ఆడు వారిని గౌరవించడం మన సంస్కృతి అని జరిగినదానికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

శ్రీనివాస్ సంగా గారు మాట్లాడుతూ జరిగిన సంఘటన హేయమని అందరూ దీనిని ప్రతిఘటించాలన్నారు.

విజయ కృష్ణ యడ్లపల్లి గారు మాట్లాడుతూ 19-11-21 శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రజలకు ‘దుర్దినం’

రాష్ట్ర శాసనసభ లో జరిగిన జుగుప్సాకరమైన సంఘటనను మనిషిగా పుట్టిన ప్రతివారు  ప్రతిఘటించాలన్నారు పాలక పక్షం వారు సభలో మాట్లాడిన మాటలకు సమాజం సిగ్గుతో తల దించుకొనే లాగా వున్నదని, చట్టాలు చేసే ‌సభలో  చట్టమంటే లెక్కలేని వారు కూర్చుంటే ఇంత కంటే ఏముంటుందని, వారికి ఓట్లేసి ఆ సభలో కూర్చోబెట్టిన వారు కూడా  ఈ స్థితికి బాధపడుతున్నారనీ, ‘శ్రీమతి భువనేశ్వరి’ రామారావు గారి కూతురో, చంద్ర బాబు నాయుడు గారి భార్యో అని చూడ వద్దు ఆమె ఒక స్త్రీ మూర్తి మన ఆడ పడుచు.

భారత దేశం లోనే కాదు ప్రపంచం లో ‘స్త్రీ’ లకున్న గౌరవం, ప్రాధాన్యత ఇంకెవ్వరికి లేవనీ, సమాజంలో ‘స్త్రీ’ తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా తన స్థానాన్ని  కాపాడుకుంటుందనీ, మన పురాణాలలో స్త్రీ పాత్రలకున్న గౌరవం చాల గొప్పదనీ, సీత, ద్రౌపది వంటి పతివ్రతలను వేధించి హింసించిన వారు బంధు మిత్ర పరివారముతో ‌ సహా నాశనమై  పోయారో వివరించారు.

“మహా భారతం” లోని సభా పర్వం లో “మహా దారుణ మది విషము కంటె దహనము కంటే”  వాక్పారుష్యం పనికిరాదని, అది విషము కంటేనూ,  అగ్ని కంటేనూ కూడా దారుణమయిందని “నన్నయ” గారన్నారని  చెప్పి ముగించారు.

కోటేశ్వరరావు పాతూరి గారు మాట్లాడుతూ  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రెండున్నర సంవత్సరాల నుండి పరిపాలన కుంటుబడి పోయిందని, 33 వేల యకరాల భూములు రాజధాని కొరకు త్యాగం చేసిన 29 గ్రామాల రైతులు 32  వేలమంది ఉసురు తీ‌స్తున్నారనీ, వారిని అతిదారుణంగా ఈ ప్రభుత్వం హింసిస్తున్నదన్నారు.

ఎక్కడ చూసినా భూకబ్జాలు, ఇసుక మాఫియాలు,దుండగాలు, దురాగతాలు తప్ప ప్రజాహిత కార్యక్రమాలేమీ లేవన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారన్నారు.

దోపిడీలు,మానభంగాలు మితిమీరిన వన్నారు.” ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలుంటారు” అన్న నానుడిని విస్మరించారన్నారు.

ఈ ప్రభుత్వం జారీ చేసినవి 200 లకు పైగా GO లను కోర్టులు కొట్టివేశారన్నారు.

ఫణి తేళ్ళ గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని లో భావప్రకటనా స్వేచ్చ లేకపోవటం, మానవ హక్కుల ఉల్లంఘనల పై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

నాగేశ్వరరావు మన్నె గారు మాట్లాడుతూ  ప్రభుత్వ పాలకులు తమ బాధ్యతలను విస్మరించి మంత్రుల చేత శాసన సభ్యుల చేత ప్రతిపక్షాల వారి పై దాడులు చేపిస్తున్నారన్నారు.

వేణు తలశిల గారు మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధమైన పదవులనుభవిస్తూ బాథ్యతలు విస్మరించి ఇతరుల మీద నిందలు  వేయటమే పనిగా పెట్టుకున్న  వై సి పి  నేతలు రాజకీయాల వైపు కన్నెత్తి కూడా చూడని ” శ్రీమతి భువనేశ్వరి ”  తన తండ్రి గానీ, భర్త గానీ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు  కూడా ఎటు వంటి పైరవీలు చేయకుండా తన కుటుంబము తమ  వ్యాపారాలకే పరిమితమై ఉన్న ఆమెపై నిందలు వేసేవారు ఆపనిని ఆపి  వారి పుట్టుక, వారి పిల్లల పుట్టుకల గుఱించి తవ్వకాలు జరుపుకుంటే మంచిదని సూచించారు.

ఈ కార్యక్రమానికి తమ ‌సంపూర్ణ సహకారన్నందించిన శ్రీధర్ కేశాని గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags: ohio nris
Previous Post

టీఆర్‌ఎస్ ను దెబ్బకొట్టేందుకు ఈటల సరికొత్త వ్యూహం!

Next Post

‘తానా’ లో మూడు ముక్కలాట!

Related Posts

Around The World

పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా

July 5, 2022
Andhra

యథా రాజా.. తథా పోలీసు!

July 5, 2022
NRI

ఒంగోలు మహానాడు లో బుచ్చి రామ్ ప్రసాద్ మజ్జిగ పాకెట్స్ ఉచితంగా పంపిణి!

June 15, 2022
NRI

అమెరికాలో ఆపద్భాందవుడు – కృష్ణ ప్రసాద్ సోంపల్లి

June 14, 2022
NRI

NRI TDP Kuwait-NRI TDP Kuwait సెల్ కువైట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా శక పురుషుని శత జయంతి ఉత్సవ వేడుకలు

June 11, 2022
NRI

ఓహియోలో.. వీనుల విందు చేసిన మ‌ణిశ‌ర్మ మ్యూజిక‌ల్ నైట్‌..

June 10, 2022
Load More
Next Post

'తానా' లో మూడు ముక్కలాట!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ తెలుగు హీరో మళ్లీ ఆగయా !
  • బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ
  • మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు
  • నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !
  • సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్
  • రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !
  • ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?
  • ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు
  • జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !
  • టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు
  • కాళీమాతపై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్లు..వైరల్
  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

యథా రాజా.. తథా పోలీసు!

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra