కొన్నిసార్లు అంతే.. అప్పటివరకు తిరుగులేని రీతిలో సాగే టైం పూర్తిగా మారిపోతుంది. తప్పుల మీద తప్పులు చేసినా తమకు తగ్గట్లు నడిచే టైం.. ఏ మాత్రం సహకరించదు. ఇప్పుడు అలాంటి అనుభవమే ఏపీ సెలబ్రిటీ నూతన్ నాయుడు సతీమణి మధులతకు ఎదురవుతుందని చెప్పాలి. అవసరం లేని వివాదాన్ని అనవసరంగా నెత్తి మీద వేసుకొన్న ఆమె మరోసారి ఎదురైందని చెప్పాలి.
దళిత యువకుడ్ని అకారణంగా హింసకు గురి చేయటమే కాదు.. శిరోముండనం చేసి భారీ తప్పు చేసిన ఆమెపై కేసు నమోదు కావటం.. జైలుకు పంపటం లాంటివి చోటు చేసుకోవటం తెలిసిందే. ఇంట్లో పని చేసే వ్యక్తి మీద అనుమానంతో దారుణంగా వ్యవహరించిన వైనం వెలుగు చూసి సంచలనంగా మారింది. ఆ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజ్ బయటకు వచ్చి.. అందరిని అవాక్కు అయ్యేలా చేసింది.
సదరు ఉదంతంపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు మధుప్రియ.. నూతన్ నాయుడులతో పాటు మరికొందరిని రిమాండ్ కు తరలించారు. తాజాగా ఆ కేసులో మధుప్రియకు బెయిల్ వచ్చింది. దీంతో జైలు నుంచి విడుదలైన ఆమెను మరోసారి పోలీసులు అరెస్టు చేయటం గమనార్హం.
ఈసారి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి దగ్గర నుంచి మధుప్రియ రూ.25లక్షలు వసూలు చేశారని.. మోసం చేసిన ఆమెను అదుపులోకి తీసుకొని కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. ఈ కేసులో ఆమెకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన గంటల్లోనే మళ్లీ జైలుపాలు కావటంతో ఆమె విస్తుపోయేలా చేసింది. రానున్న రోజుల్లో మరెన్ని కేసులు తెర మీదకు వస్తాయో చూడాలి.