తెలంగాణలో ఇప్పటికే కొనసాగుతున్న వివాదాలకు ఇప్పుడు సరికొత్త వివాదం కలిసి వచ్చింది. ఈ జాబి తాలో తాజాగా `న్యూడ్ కాల్` రచ్చ చేరిపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు వచ్చిన న్యూడ్ కాల్ వ్యవహారం.. రాజకీయంగా సంచలనం అయింది. ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కు వచ్చిన వీడియో కాల్లో ఓ మహిళ నగ్నంగా దర్శనమిచ్చింది. దీంతో ఉలిక్కిపడిన ఎమ్మెల్యే “ఇదేంటని“ ఆశ్చర్యం పోయారు. ఆ వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
ప్రస్తుతం తెలంగాణ టార్గెట్ రాజకీయాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నువ్వొకటంటే.. నేరెండం టా అన్నట్టుగా అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం ఓ రేంజ్లో సాగుతోంది. ఈ క్రమంలో ఈ నెల 14న ఎమ్మెల్యేకు వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. అయితే.. అది తనకు తెలియని నెంబర్ కావడంతో ఎవరా? అని భావించిన ఎమ్మెల్యే కాల్ ఎత్తారు. అందులో ఎలాంటి మాటా మంతీ లేకుండానే ఓ మహిళ నగ్నంగా దర్శనమిచ్చింది. ఆ వెంటనే ఎమ్మెల్యే సదరు కాల్‌ను కట్ చేశారు.
సీఎంకు తెలుసు!
అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో వెంటనే ఈ విషయాన్ని జిల్లా మంత్రికి తెలియజేసినట్టు సమాచారం. ఆవెంటనే సీఎం దృష్టికి కూడా ఈవిషయం వెళ్లిందని కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతోంది. సీఎం సూచనల మేరకు రెండు రోజుల తర్వాత.. ఈ నెల 17 న సైబర్ పోలీసులకు సదరు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అయితే.. ఇన్నాళ్లు గోప్యంగా ఉన్న ఈ విషయాన్ని తాజాగా బయటకు చెప్పడం గమనార్హం.
ఆ పార్టీయేనా?
ఇక, ఈ న్యూడ్ కాల్ వ్యవహారంపై.. కాంగ్రెస్ పార్టీ నాయకులు .. ఓ కీలక పార్టీవైపే వేళ్లు చూపిస్తున్నారు. అయితే.. ఎవరూ కన్ఫర్మ్ చేయడం లేదు. కానీ, అనుమానాలు మాత్రం ఆ పార్టీపైనే ఉన్నాయని కాంగ్రెస్ ముఖ్య నాయకుడు ఒకరు చెప్పారు. గుర్తు తెలియని మహిళ కావడం.. తెలియని నెంబరు కావడంతో ఇదంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఉద్దేశ పూర్వకంగా ఇరికించేందుకు చేస్తున్న కుట్రగానే పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి ఈ ఘటన ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.