• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎన్టీఆర్ పేరు మార్పు జగన్ పతనానికి నాంది – మన్నవ సుబ్బారావు

admin by admin
September 24, 2022
in NRI
0
0
SHARES
198
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆంధ్రుల ఆరాధ్య నటుడు, ప్రజా నాయకుడు.. తెలుగు వారికి ‘అన్న’ ఎన్టీఆర్ పేరును తొలగిస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ సి మెట్రో ప్రాంతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారందరూ ముక్తకంఠంతో ఖండిస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. దీనికి భాను మాగులూరి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ: జగన్ కు పేర్లు, రంగుల పిచ్చి పరాకాష్టకు చేరింది అన్నారు. పిచ్చి ముదరడంతో ఏది కనిపిస్తే దానికి పార్టీ రంగులు పూయడం లేదా తన పేరో, తన తండ్రి పేరో పెడుతున్నాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటం ఇదొక చారిత్రిక తప్పిదం. జగన్ మెడకు ఇది ఉరితాడు అవుతుంది. వైద్య విద్యకు ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలి. వైద్య విద్య ప్రమాణాలు పెంచాలనే ఉన్నతమైన ఆలోచనలతో 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ దీన్ని ప్రారంభించారు. కానీ ఎన్టీఆర్ తన పేరు పెట్టుకోలేదు. ఆయన మరణానంతరం ఆయన పేరు పెట్టడం జరిగింది. ఇప్పటికే జగన్ రెడ్డి అనేక ప్రభుత్వ పథకాలకు తన సొంత పేర్లు పెట్టుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సుమారు 90 పథకాలకు పేర్లు మార్చి తన తండ్రి పేరు, తన పేరు పెట్టుకొని జబ్బలు చరుచుకుంటావున్నాడు. ఏదైనా కొన్ని కొత్త ప్రాజెక్టులు నిర్మించి… లేదా ఇంకా గొప్ప పధకాలు రూపొందించి తన తండ్రి పేరు, తన పేరు పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా వున్న పేర్లు తొలగించి ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్ పేరు పెట్టడం ముమ్మాటికీ సమంజసం కాదని ఉద్ఘాటించారు.

భాను మాగులూరి మాట్లాడుతూ, ఇది దివంగత నేత వైఎస్సార్ కి కూడా గౌరవం తెచ్చిపెట్టే అంశం ఏమాత్రం కాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికార మార్పిడితో పాటు పేర్లు కూడా పూర్తిగా మారిపోతాయా? ఇలాగే గతంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును తొలగించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇలానే అలోచించి ఉంటే వైఎస్సార్ జ్ఞాపకాలు ఏమి మిగిలేవి కావు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుతున్న వేళ తెలుగువారందరిని అవమానపరిచేవిధంగా వుంది. పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ చరిత్రను, కోట్లాదిమంది ప్రజల హృదయాలలో వున్న అభిమానాన్ని చెరిపివేయలేరు. తెలుగువారి ఆత్మా గౌరవానికి ప్రతీకగా నిలిచి…. తెలుగువారి శాశ్వత గుండె చప్పుడుగా మిగిలిపోయారని తెలిపారు.

ఇలాంటి సామజిక ఉద్యమ నిర్మాత పేరు మార్చి జగన్ రెడ్డి చరిత్ర హీనుడుగా మిగిలిపోయాడు అని ధూళిపాళ్ల వీరనారాయణ చెప్పారు. పాల్గొన్న అనేకమంది పెద్దలు, యువకులు మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతాల కతీతంగా అన్న ఎన్టీఆర్ సమాజ సేవ చేశారని, అలాంటి వారి పేరును మార్చటం ముమ్మాటికీ సబబు కాదు.. సామాన్య ప్రజలు కూడా దీన్ని ఏమాత్రం ఒప్పుకోరని, దీనిని ఉపసంహరించుకోకపోతే తెలుగు ప్రజల ఆగ్రహానికి గురవుతారు. అంతే గాక ప్రజా న్యాయస్థానంలో దోషిగా నిలబడి మరోసారి చీవాట్లు తినక తప్పదు అన్నారు.. ఈ కార్యక్రమంలో సీతారామారావు, పురుషోత్తమరావు, బసవరావు, సిద్దార్ధ్, నాగశంకర్, వినీల్ తదితరులు పాల్గొన్నారు.

Tags: ntr university name
Previous Post

బాహుబలి ఫీవర్ నుంచి బయటకు రండిరా సామీ

Next Post

వైసీపీని మ‌ళ్లీ గెలిపిస్తే.. జ‌రిగేది ఇదేనా.. నెటిజ‌న్ల టాక్‌

Related Posts

NRI

BRS-June 2న, అమెరికా వ్యాప్తంగా, 25 నగరాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు!

June 1, 2023
NRI

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

June 1, 2023
NRI

‘నారా లోకేష్’ సహకారంతో ఆధునాతన రాట్నం!

May 31, 2023
NRI

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

May 30, 2023
chandrababu in mahanadu
NRI

‘తెలుగు హెరిటేజ్ వీక్’…నార్త్ కరోలినా గవర్నర్ కు చంద్రబాబు ధన్యవాదాలు

May 30, 2023
NRI

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

May 30, 2023
Load More
Next Post
jagan

వైసీపీని మ‌ళ్లీ గెలిపిస్తే.. జ‌రిగేది ఇదేనా.. నెటిజ‌న్ల టాక్‌

Latest News

  • ఆ సర్వేలో అట్టడుగున ఏపీ..చంద్రబాబు ఫైర్
  • తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు తొక్కేశారు:కేసీఆర్
  • తమ్మినేనికి అంకుశం రామిరెడ్డి సీన్ తప్పదంటూ వార్నింగ్
  • ఏజెంట్ దర్శకుడిపై ఎంత నమ్మకమో..
  • BRS-June 2న, అమెరికా వ్యాప్తంగా, 25 నగరాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు!
  • సత్తెనపల్లి టీడీపీలో ముసలం..కన్నాపై శివరాం షాకింగ్ కామెంట్స్
  • తలైవా వివాదంలో మోహన్ బాబు తలదూరుస్తారా?
  • ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?
  • ఊరూవాడా.. మేనిఫెస్టో ప్ర‌చారం.. క‌దులుతున్న త‌మ్ముళ్లు!
  • చంద్ర‌బాబు రికార్డును కేసీఆర్ తిర‌గ‌రాస్తున్నారట
  • రాహుల్ గాంధీ ‘స్టాన్ ఫోర్డ్’ యూనివర్సిటీ పర్యటన – ఫోటో గాల్లరీ
  • ద‌స్త‌గిరిని లొంగ‌దీసుకున్నారు.. మేం అమాయకులం- స‌జ్జ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!
  • ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?
  • ఏపీలో సీన్ రివ‌ర్స్‌… సంక్షేమం వ‌ర్సెస్ సంక్షేమం + అభివృద్ధి.. !

Most Read

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

రాజధాని వైజాగ్ అయితే.. పేదలకు ఇళ్లు అక్కడ ఇవ్వాలి కదా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra