వైఎస్ జగన్ తాను రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాను అంటూ… ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు న్యాయం చేస్తాను అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. పాపం రైతులంటే జగన్ కి ఎంత ప్రేమ అని ఇంతకాలం ఏపీని పట్టించుకోకుండా ఇపుడు లాక్ డౌన్ లో తెగ ఖాళీగా ఉన్న వారు ఏపీలో రైతులను ఆదుకోవడానికి జగన్ దిగి వచ్చాడన్నట్లు మాట్లాడుతున్నారు. వాస్తవం ఏంటంటే… ఇది జగన్ ప్రవేశ పెట్టిన కొత్త పథకం కాదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. అప్పట్లో ‘‘ఎన్టీఆర్ జలసిరి‘‘ పేరుతో చంద్రబాబు నాయుడు పేద రైతుల కోసం ఈ పథకంప్రవేశపెట్టారు.
ఈ పథకం కింద విద్యుత్ కూడా ఏర్పాటుచేయించారు. దానిని ఏడాదిన్నర పాటు రద్దు చేయడం ద్వారా ఎంతో మంది రైతులకు జగన్…అన్యాయం చేసినట్టయ్యింది.ఇంతకీ జగన్ రెడ్డి ప్రభుత్వం జలసిరి పథకాన్ని ఎందుకు రద్దు చేసిందో తెలుసా.. దానికి 2 కారణాలు
1. అదే పథకానికి పేరు మారిస్తే తనకు క్రెడిట్ రాదు.
2. వెంటనే కొత్త పేరుతో తిరిగి ప్రారంభిస్తే పబ్లిసిటీ చేసుకోలేం.
ఈ కారణాల వల్ల జగన్ చంద్రబాబు పథకాలను ముందు రద్దు చేశారు. వాటిని జనం మరిచిపోయాక… మెల్లగా తన తండ్రి పేరు మీద మార్చారు. పిల్లలకు ఇచ్చే కిట్, కాన్పులకు ఇచ్చే సాయం, చంద్రన్న బీమా…ఇలా ఒకటేమిటి… అనేక పథకాలు చంద్రబాబు పెట్టినవి రద్దు చేయడం, కొంతకాలం పక్కన పెట్టడం, మళ్లీ తానే కొత్తగా ఆలోచించి ప్రవేశపెట్టినట్టు కొత్త పేరుతో ప్రారంభించి భారీ ర్యాలీలు, పబ్లిసిటీలు చేసుకోవడం. ఇది జగన్ రెడ్డి తీరు.
గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ పథకం కింద 17878 మంది రైతులు లాభపడగా… కొత్త 45 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఇదిగో సాక్ష్యం.
మొత్తానికి భలే మాయ చేసింది ఏపీ ప్రభుత్వం. పాతపథకానికి కొత్త రంగులు… అదిరిపోయే పబ్లిసిటీ.