NTR @tarak9999's Press Release demanding Justice to Shyam. #WeWantJusticeForShyamNTR pic.twitter.com/3Y3hF8xLsR
— NTR Trends (@NTRFanTrends) June 27, 2023
తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరులో శ్యామ్ అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అనుమానాస్పద మృతి చెందిన విషయం ఒక రోజు తర్వాత పెద్ద ఇష్యూగా మారుతోంది. ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన శ్యామ్.. గతంలో ఒక సినిమా వేడుకలో స్టేజ్ ఎక్కి ఎన్టీఆర్‌ను వాటేసుకోవడం, సెక్యూరిటీ సిబ్బంది అతణ్ని లాగేయబోతుంటే ఎన్టీఆర్ ఆపి ఫొటో దిగే అవకాశం కల్పించడం తారక్ అభిమానులకు బాగా గుర్తు.
20 ఏళష్ల వయసున్న ఈ కుర్రాడు హఠాత్తుగా ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతను ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తేల్చేసి.. పోస్టు మార్టం కూడా చేసేశారు. తమ కొడుకుది ఆత్మహత్యే అంటూ తల్లిదండ్రులతోనూ సంతకం పెట్టించేసుకున్నారు. కానీ శ్యామ్‌ను చూసేందుకు వచ్చిన తారక్ అభిమానులు మాత్రం అతడి మృతిపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నిన్నటి వరకు చిన్న విషయంగా ఉన్న ఈ ఇష్యూ ఈ రోజుకు పెద్దదిగా మారి.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సహా టీడీపీలో పెద్ద పెద్ద నాయకులు, ఆ పార్టీ మద్దతుదారుల పోస్టులు పెట్టి శ్యామ్‌కు న్యాయం చేయాలని ట్రెండ్ చేసేవరకు వెళ్లింది. ఎన్టీఆర్‌తో శ్యామ్ ఉన్న ఫొటో పెట్టి బాలకృష్ణ సైతం అతడి మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేయడం.. తారక్ సైతం తన అభిమాని కోసం ఒక పోస్టు పెట్టడం గమనార్హం.
మొత్తంగా ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది. శ్యామ్ మృతదేహాన్ని చూసిన వారికి అతడి మృతిపై అనుమానాలు కలగడంలో ఆశ్చర్యం లేదు. అతడి చేతిపై గాట్లున్నాయి. అలాగే ఉరిపోసుకున్న విధానం ఆశ్చర్యం గొలుపుతోంది. పొడగరి అయిన శ్యామ్ కాళ్లు చనిపోయిన సమయంలో నేలకు ఆని ఉన్నాయి. అన్నింటికీ మించి అతడికి గంజాయి వ్యసనం ఉందని చెప్పడానికి నోటి మీద గంజాయి ఆకులు పెట్టడం విడ్డూరం.
ఎవరైనా చనిపోయే వ్యక్తి అలా నోట్లో నమలకుండా గంజాయి పెట్టుకుని.. ఆ తర్వాత ఉరి పోసుకుని చనిపోతాడా అన్నది ప్రశ్నార్థకం. అతను నిజంగా ఆత్మహత్య చేసుకున్నట్లయితే.. పోలీసులు ఈ విషయంలో ఎందుకు హడావుడి పడుతున్నారు.. ఏదో కవరప్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అన్నది అర్థం కాని విషయం. టీడీపీ వాళ్లు ఈ ఇష్యూను టేకప్ చేసి వైరల్ చేయడంతో పాటు.. జనసేన వర్గీయులు, అలాగే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా దీని మీద స్పందించాలని కోరుతున్నారు.
కొన్ని రోజుల కిందటే ఒక 15 ఏళ్ల పిల్లాడిని వైసీపీ వాళ్లు పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసి.. ఆ ఇష్యూను సైలెంటుగా సెటిల్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు శ్యామ్ విషాదాంతాన్ని కూడా అలాగే చేస్తున్నారనే ఉద్దేశంతో దీన్ని అంత తేలిగ్గా వదలకూడదనే పట్టుదల టీడీపీ వర్గాల్లో కనిపిస్తోంది.
నాకున్న కొన్ని సందేహాలు శ్యామ్ మరణం లో. ఎవ్వరికి సపోర్ట్ కాదు వ్యతిరేకంగా కాదు. ఎవ్వరు ఆన్సర్ ఇచ్చిన నో ఇష్యూ pic.twitter.com/PiB2j2qBri
— aruna janasena (@RayapatiAruna) June 27, 2023
తూర్పుగోదావరి జిల్లా, కొప్పిగుంట గ్రామానికి చెందిన శ్యామ్ అనే యువకుడి మరణం పై అన్నీ అనుమానాలే. శ్యామ్ ఉరి వేసుకుంటే కాళ్లు నేలకు తాకి ఎలా ఉంటాయి? శరీరం మీద, ముక్కు మీద గాయాలు ఎందుకు ఉన్నాయి? శ్యామ్ జేబులో గంజాయి ప్యాకెట్లు ఎక్కడివి? చేయి కోసుకుంటే అంత నిలకడగా ఎలా ఉరి వేసుకొంటాడు?… pic.twitter.com/Y9IVrlNoiz
— Telugu Desam Party (@JaiTDP) June 27, 2023
We Miss You Shyam ????????#WeWantJusticeForShyamNTR pic.twitter.com/vDmJPAjgwI
— Nadiri Ravi 9999 (@NadiriRRRavi) June 27, 2023