Had a good interaction with a very talented actor and the gem of our Telugu cinema, Jr NTR in Hyderabad.
అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్తో ఈ రోజు హైదరాబాద్లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది.@tarak9999 pic.twitter.com/FyXuXCM0bZ
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) August 21, 2022
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఒక రోజు ముందే ఈ విషయం బయటకు రావడంతో అభిమానుల్లో, తెలుగు ప్రజల్లో ఇది పెద్ద చర్చకు దారితీసింది.
మునుగోడు మీటింగ్ నుంచి రామోజీరావు వద్దకు వెళ్లి ఆయనను కలిసిన అమిత్ షా అక్కడి నుంచి నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు. హోటల్లో కేంద్రమంత్రిని ఎన్టీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి అమిత్షా, జూ.ఎన్టీఆర్ భేటీపై రాజకీయవర్గాల్లో ప్రత్యేక ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది.
బీజేపీ ఆహ్వానంతో ఎన్టీఆర్ అమిత్ షాను కలిశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనను ప్రశంసించడానికే ఎన్టీఆర్ను అమిత్ షా ఆహ్వానించినట్లు బీజేపీ నేతలు చెప్పారు కానీ తెలంగాణలోని ఒక వర్గాన్ని ఆకట్టుకోవడానికి ఇది ప్రత్యేకంగా బహిరంగంగా ఏర్పాటుచేసిన బేటీ అని అర్థమవుతోంది.