మనిషి భోగభాగ్య వైభోవాలతో విలాసవంతమైన జీవితానాన్ని గడిపినా… కటిక దరిద్రంలో పూరి గుడిసెలో జీవించినా.. చివరకు అందరి గమ్మం ఒకటే. ధనికుడైనా, పేదవాడైనా అందరికీ ఆరు అడుగుల స్థలంలో పూడ్చి పెట్టాల్సిందే.. లేదంటే దహనం చేయాల్సిందే. జీవి విడిచిన మనషికి తరతమ భేదం లేకుండా, గౌరప్రదంగా వీడ్కోలు పలకాన్నదే ఎన్నారై ‘వల్లేపల్లి శశికాంత్’ లక్ష్యం. ‘ఆఖరి మజిలీ’లో వారికి కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి, గౌరవప్రదంగా సాగనంపాలనే ఉద్దేశంతో శశకాంత్, గుడివాడలోని పుల్లలపాడు స్మశానవాటికకు తన వంతు సాయాన్ని అందిస్తున్నారు.
ఇప్పటికే పుల్లలపాడు స్మశాన వాటిక అభివృద్ధికి రోటరి క్లబ్ కృషి చేస్తోంది. కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి స్మశానవాటికను నందనవనంగా తీర్చిదిద్దారు. అయితే రాజేంద్రనగర్ కు చెందిన దివంగత ‘వల్లేపల్లి సీతా రామమోహన రావు’ జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు ‘వల్లేపల్లి శశికాంత్’, పుల్లలపాటు వైకుంఠదామ అభివృద్ధికి రూ. 30 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మొత్తంలో పది లక్షల రూపాయలతో నూతనంగా వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే మరో 20 లక్షల రూపాయలతో మార్చురీ గదిని నిర్మించాలని అనుకుంటున్నారు. మార్చురీ గది నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. దూర ప్రాంతం నుంచి బంధువుల వచ్చే వరకు మృతదేహాలను భద్రపరిచేందుకు పట్టణంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఎన్నారై శశికాంత్ మార్చురీ గదిని నిర్మించాలని భావించారు. శశికాంత్ ను రోటరి క్లబ్ నిర్వాహకులు జి. బాబూ శ్రీకర్, రావి శ్రీ హర్ష చౌదరి, టీఎన్ రాజశేఖర్ పలువురు అభినందించారు.