ఆమె పేరు మహ్మద్ పర్వీన్. ఆమె తండ్రి చాంద్ బాషా ఓ చిరుద్యోగి. ఆమె స్వస్థలం గుంటూరు. అయితే అమెరికాలో ఉన్నత చదువులు చదవాలన్నది ఆమె ఆకాంక్ష. కానీ వారి కుటుంబానికి అంత స్థోమత లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్ర బాబు నాయుడు ప్రవేశపెట్టిన విదేశీ విద్యాపథకం ఆమెకు అండగా నిలబడింది. 2019లో ఈ పథకం కోసం ధరఖాస్తు చేసుకున్న ఆమెకు రూ.15 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది.
టీడీపీ ప్రభుత్వం చేసిన ఆర్థికసాయంతో అమెరికాలోని నార్త్ వెస్ట్ మిస్సోరి వర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించింది మహ్మద్ పర్వీన్. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించుకుని పనిచేస్తున్నది. తన ఎదుగుదలకు కారణం అయిన తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి తాను భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నది. ఈ నెల 13న ఏపీలో ఎన్నికల నేపథ్యంలో అమెరికా నుండి గుంటూరుకు వచ్చేసింది.
‘నా Using పేద విద్యార్థుల బాగు కోసం సైకిల్ గుర్తుకే ఓటు వేసి చంద్రబాబు నాయుడును గెలిపించుకుంటాం’ అని గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి మాధవికి పర్వీన్ చెప్పారు. గుంటూరు పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు ఈ విషయం తెలిసి ఆమెను ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించారు.