ఆధారాలు లేని రిపోర్ట్ తో గడిచిన 8 రోజులుగా “చంద్రబాబు నాయుడు గారు ” అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు టెక్సాస్ రాజధాని – ఆస్టిన్ లో ప్రవాస ఆంధ్రులు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు, కుటుంబ సభ్యులతో కలిసి 400 పైగా స్వచ్చంధంగా నిరసన తెలియచేసారు..
చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈ రోజు అగ్రరాజ్యంలో మంచి హోదాలలో వివిధ కంపెనీలో లబ్ధిపొందుతున్నం అని కొనియాడారు.
ఇలా అన్యాయం గా, కక్షపూర్వితంగా నిర్బందించటం పాలకుల తీరుకి నిదర్శనం, ఆయన త్వరగా ఆరోగ్యంగా గౌరవంగా విడుదల చేయాలి అని శాంతియుతంగా జై బాబు అని నినాదాలతో కార్యక్రమం ముగించారు.