కొన్ని కొన్ని నిర్ణయాలు ఊహించని విజయాన్ని అందిస్తాయి. కొన్ని కొన్ని వ్యూహాలు, ఆశించిన దానికంటే ఎక్కువగానే ఫలిస్తాయి. ఇప్పుడు ఎన్నారై టీడీపీలోనూ ఇదే జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయం, నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న `ఎన్నారై టీడీపీ`నిపరుగులు పెట్టి స్తోంది. అగ్రరాజ్యంలో పార్టీ నిర్మాణం మరింత బలోపేతం అయింది. ఎన్నారై టీడీపీ విభాగం సమన్వయ కర్తగా ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఉన్నత విద్యావంతులు, అందరికీ తలలో నాలుకగా వ్యవహరించే జయరాం కోమటి నియమితులు అయ్యాక పార్టీలో నూతనోత్తేజం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
నిజానికి తెలుగుదేశం అత్యంత పకడ్బందీ నిర్మాణం ఉన్న పార్టీ. అయితే కారణాలు ఏవైనా కూడా, ఎన్నారై టీడీపీ విభాగం గడిచిన కొన్నాళ్లుగా నిస్సత్తువగా ఉంది. పార్టీ నిర్మాణం కూడా అగ్రరాజ్యంలో బాగోలేదనే కామెంట్లు వినిపించాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే వినిపించా యి. దీంతో అప్పట్లోనే ఎన్నారై టీడీపీలో మార్పులు చేయాలని. పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు భావించారు. కానీ, అనుకున్న విధంగా ఆయన సమయం కేటాయించలేక పోయారు.
ఎట్టకేలకు గత ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నారై టీడీపీ సమన్వయ కర్తగా సీనియర్ నాయకుడు, పార్టీకి అత్యంత విధేయులుగా ఉన్న జయరాం కోమటికి పగ్గాలు అప్పగించారు. ముఖ్యంగా చంద్రబాబు విజన్‌ను ఆకళింపు చేసుకున్న ఆయన చంద్రబాబు పిలుపుతో అనేక కార్యక్రమాలు చేపట్టారు. పార్టీలో పదవులు ఉన్నా, లేకున్నా, ఆయన పార్టీలైన్ మేరకు ఏపీలో అనేక స్వచ్ఛంద సేవలు అందించారు. ముఖ్యంగా చంద్రబాబు తీసుకు వచ్చిన డిజిటల్ విద్యకు ఎన్నారైల తరఫున ఏపీలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
బాధ్యతలు తీసుకోన్నాక ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవడం, పార్టీకి యువతను చేరువ చేయడం, అన్నివర్గాలను సమీకరించడం, పార్టీ తరఫున గట్టివాయిస్ వినిపించడం, పార్టీలో అందరినీ సమన్వయం చేయడం వంటి కీలక అంశాలను తనదైన శైలిలో ముందుకు నడిపించిన జయరాం అన్ని విషయాల్లోనూ సక్సెస్ సాధించారు.
బోస్టన్ మహానాడుతో తొలి విజయం
జయరాం కోమటి ఎన్నారై టీడీపీ పగ్గాలు చేపట్టిన వెంటనే వచ్చిన తొలి పండుగ మహానాడు. మేలో 28 నుంచి మూడు రోజుల పాటు అత్యత వైభవంగా నిర్వహించే మహానాడును ఆయన ముందస్తుగా, 20, 21 తేదీల్లో బోస్టన్ వేదికగా ఘనంగా నిర్వహించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తెలుగు వారిని, పార్టీ అభిమానులను, కార్యకర్తలనను ఏకం చేసి, బోస్టన్ మహానాడుకు శ్రీకారం చుట్టారు. పూర్తి బాధ్యతను తన భుజంపై వేసుకున్న జయరాం అన్ని విషయాలను పరిశీలించి మహానాడును దిగ్విజయం చేశారు.
ముఖ్యంగా యువతకు , మహిళలకు ప్రాధాన్యం కల్పించారు. ఇదే వేదికగా, టీడీపీ సభ్యత్వ ననమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాలను కలుపుకు పోయారు. ఇలా ఆయన అకుంఠిత దీక్ష, అలుపెరుగని కృషితో టీడీపీలో ఎవరికి వారుగా ఉన్న అభిమానులను బోస్టన్ వేదికగా ఒకే గొడుగు కిందకు తెచ్చారు. చంద్రబాబు ప్రాధాన్యాన్ని, ఏపీలో టీడీపీ ప్రభుత్వం మరోసారి రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
మొత్తంగా, జయరాంకి పగ్గాలు అప్పగించడం ద్వారా, చంద్రబాబు ఎన్నారై టీడీపీని కొత్తపుంతలు తొక్కించారనడంలో ఎలాంటి సందేహం లేదు.