తెలుగుదేశం పార్టీ ఏటా మే నెల చివరిలో నిర్వహించే మహానాడుకు ఉన్న ప్రత్యేకతే వేరు. పార్టీ భూత, భవిష్యత్, వర్తమానాలపై చర్చించి, దిశానిర్దేశం చేసే ఈ మహానాడుకు ఘనమైన చరిత్ర ఉంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ మహానాడును క్రమం తప్పకుండా, ఏటా మేనెలలో అన్నగారి పుట్టిన రోజు నాటి నుంచి మూడు రోజులు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లు వర్చువల్‌గానే నిర్వహించిన ఈ మహానాడును ఈ ఏడాది, ఒంగోలులో నిర్వహించాలని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
దీనికి సంబంధించి ఏర్పాట్లు వడివడిగా జరుగుతున్నాయి. ఇక, మహానాడు అంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ అభిమాను లు, నాయకులు, కార్యకర్తలే కాకుండా, దేశ, విదేశాల్లోని పార్టీ అబిమానులు కూడా భారీ సంఖ్యలో వస్తుంటారు. మహానాడులో పాల్గొని పార్టి పట్ల అంకితమవుతామని ప్రతిజ్ఞలు చేస్తారు. ఇదిలావుంటే, మహానాడుకు వచ్చే కార్యకర్తలు, నేతలు, నాయకుల కు ఏర్పాటు చేసే విందు ఒక ప్రత్యేక ఘట్టమనే చెప్పాలి.
వివాహ భోజనాన్ని మించిన తరహాలో మహానాడు వంటకాలు సిద్ధం చేస్తారు. ఉదయం టిఫిన్ నుంచి, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ వరకు, ఇలా ప్రత్యేక వంటకాలు, స్వీట్లతో మహానాడు ఘుమఘుమ లాడిపోతుంది. ఈ సాంప్రదాయాన్ని ఏటా ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా కొనసాగిస్తున్నారు.
ఈ ఏడాది కూడా అదే ఘుమఘుమ!
ఈ ఏడాది కూడా మహానాడు ఘుమఘుమలాడనుంది. చవులూరించే వంటకాలకు వేదిక కానుంది. ఇప్పటికే ఏయే సమయాల్లో ఎలాంటి వంటకాలు రెడీ చేయాలనే అంశంపై.. మహానాడు నిర్వాహక బృందం ఒక మెనూ సిద్ధం చేసింది.
ఉదయం టిఫెన్ ఇలా..
ఇడ్లీ, వడలు, నేతి జీడిపప్పు ఉప్మా, కర్నూలు వేరు శనగ పచ్చడి, అల్లంపచ్చడి, కోనసీమ కొబ్బరి పచ్చడి, కొబ్బరి కారం, నల్లకారం, అరకు కాఫీ, మసాలా టీ.
మధ్యాహ్న భోజనం..
వెజిటబుల్ బూర్జి, కరివేపాకు కోడి వేపుడు, ఖీమా పులావ్, విజయవాడ కోడి బిర్యానీ, నాటు కోడి పులుసు, హైదరాబాద్ బిర్యానీ, సోనామసూరి అన్నం, ఆదోని ముద్దపప్పు, మంగళగిరి సొరకాయ పులుసు, గుంటూరు పెరుగు చారు, బెండకాయ పకోడి, పూత వడియాలు, రొయ్యల కూర, పన్నీర్ బట్టర్ మసాలా, ఊర మిరపకాయలు, పెరుగు అన్నం, హైదరాబాద్ కిళ్లీ.
సాయంత్రం స్నాక్స్..
ఉల్లి సమోసా, కార బూందీ, మసాలా టీ, సాల్ట్ బిస్కెట్.
రాత్రి విందు..
మిక్డ్స్డ్ వెజిటబుట్ పకోడి, మొనగాడు కోడి వేపుడు, వెజిటబుల్ పులావ్, చికెన్ బిర్యానీ, తెనాలి పప్పుచారు. అంకాపూర్ కోడికూర, కర్నూల్ మేక కూర, నెల్లూరు చేపల పులుసు, సోనా మసూరి అన్నం, దొండకాయ వేపుడే, పెరుగు అన్నం, బ్రెడ్ హల్వా, టెమాట పప్పు.
పచ్చళ్లు..
కొత్త ఆవకాయ, గోంగూర, ఉసిరికాయ, అల్లం, నిమ్మకాయ, గోదావరి రొయ్యలు, విజయవాడ మటన్ పచ్చడి, గుంటూరు కోడి పచ్చడి.
స్వీట్లు..
ఆత్యేయపురం పూతరేకులు, తాపేశ్వరం ఖాజా, పెద్దపురం పాలకొవా, కోనసీమ కొబ్బరి లౌజు, బెల్లం నేతి జిలేబి, గుంటూరు నేతి జాంగ్రీ, నేతి అరిసెలు, ఒంగోలు మైసూర్ పాక్, నెల్లూరు లడ్డు, దిల్ పసంద్.
కూల్ డ్రింక్స్..
రోజ్ ఫెలూదా, డ్రైఫ్రూట్ ఫెలూదా, చెరుకు రసం, మ్యాంగో లస్సీ, సపోటా మిల్క్ షేక్,
ఐస్ క్రీంలు..
సపోటా ఐస్ క్రీం, మలై కుల్ఫీ, వెనిల్లా ఐస్‌క్రీం, చాక్లెట్ ఐస్ క్రీం