• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్?

admin by admin
May 18, 2022
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
360
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రముఖ సినీ నటుడు అలీ 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అలీ వైసీపీ కండువా కప్పుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే, సినిమాలు, స్నేహం వేరని, రాజకీయాలు వేరని, పవన్ ఎప్పటకీ తన మిత్రుడేనని అలీ చెప్పుకొచ్చారు. అయితే, 2019 ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే టికెట్ ను అలీకి ఇస్తారని గట్టిగా ప్రచారం జరిగింది.

కానీ, అలీకి చివరి నిమిషంలో జగన్ మొండి చేయి చూపించారు. అయితే, భవిష్యత్తులో తనకు జగన్ న్యాయం చేస్తారని అలీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అలీని జగన్ రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం అలీని పిలిపించుకుని జగన్ మాట్లాడారు కూడా. ఆ భేటీ తర్వాత తన రాజ్య సభ సీటుపై త్వరలోనే అధికారికంగా ఒక ప్రకటన కూడా వస్తుందని అలీ పరోక్షంగా మీడియాకు హింట్ ఇచ్చారు.

దీంతో, ‘బాల’ నటుడి నుంచి స్టార్ కమెడియన్ గా ఎదిగిన అలీ ‘పెద్దల’ సభకు వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, నిన్న విడుదల చేసిన వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో అలీ పేరు లేకపోవడంతో అలీతో పాటు చాలామంది షాకయ్యారు. అయితే, తనకు రాజ్యసభ సీటు రాకపోవడంపై అలీ లోలోపల అసంతృప్తితో ఉన్నప్పటికీ…వేరే విధంగా స్పందించారు. రాజ్యసభ సీటును తాను ఆశించలేదని మాట మార్చారు అలీ.

అంతేకాదు, జగన్ దృష్టిలో తానున్నానని, తనకు జగన్ ఏ బాధ్యత అప్పజెప్పినా ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తానని అన్నారు అలీ. నీకు ఫలానా పదవి ఇస్తానని జగన్ ఏనాడూ గట్టిగా చెప్పలేదని, అయితే ఏదో ఒక పదవి ఇస్తానని మాత్రం చెప్పారని అలీ అసలు సంగతి వెల్లడించారు. అంతేకాదు, జగన్ పై తనకు ఆ నమ్మకం ఉందని చెప్పారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కూడా తనకివ్వలేదని, ఆల్రెడీ దాన్ని ఇతరులకు కేటాయించారని అన్నారు.

ఏదో ఒక రోజు జగన్ నుంచి పిలుపు వస్తుందని అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో, సినీ నటుడు అలీకే మూడేళ్లుగా జగన్ సినిమా చూపిస్తున్నారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.  స్టార్ కమెడియన్ అలీతోనే కామెడీనా జగన్? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags: ali dissappointedali's rajyasabha dreamcm jagancomedian alino seat for alirajyasabha seatrajyasabha seats confirmed
Previous Post

NRI TDP USA-Boston Mahanadu-ష‌డ్రశోపేతం.. చ‌వులూరించే వంట‌కాలు.. విందు భోజ‌నాలు

Next Post

కంగన సినిమా ‘అడల్ట్స్‘ ఓన్లీ అంట…

Related Posts

jagan salute
Top Stories

జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!

March 30, 2023
రామోజీ
Top Stories

రామోజీరావు పై మరో పరోక్ష దాడి మొదలుపెట్టిన జగన్

March 30, 2023
Trending

యువగళం@700 కిలోమీటర్లు..జగన్ కు లోకేష్ ఛాలెంజ్

March 30, 2023
Top Stories

జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

March 30, 2023
Andhra

జనం ‘గడప’లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

March 30, 2023
Trending

జ‌గ‌న్ పుట్టింది అందుకే…చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్

March 30, 2023
Load More
Next Post

కంగన సినిమా ‘అడల్ట్స్‘ ఓన్లీ అంట...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!
  • రామోజీరావు పై మరో పరోక్ష దాడి మొదలుపెట్టిన జగన్
  • యువగళం@700 కిలోమీటర్లు..జగన్ కు లోకేష్ ఛాలెంజ్
  • జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
  • జనం ‘గడప’లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
  • జ‌గ‌న్ పుట్టింది అందుకే…చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్
  • న‌వ‌ర‌త్నాల‌పై న‌మ్మ‌కం ఉంటే… జ‌గ‌న్‌కు స‌వాల్‌
  • టీడీపీ నాశ‌నం కోరిన వైఎస్ మట్టికొట్టుకుపోయారు
  • బాలీవుడ్ పాలిటిక్స్ వల్లే హాలీవుడ్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్
  • ఆ బెడ్రూం సీన్ చూసి ఇన్ స్పైర్ కావాలంటోన్న టాలీవుడ్ నటి
  • BATA – బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ ఉగాది సంబ‌రాలు!
  • బాగా జోరుమీదున్న సైకిల్
  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra