ఆరుగురికి ఉద్యోగాలు, ₹7.5 లక్షలు 16 మందికి వైద్య ఖర్చులకు సహాయం అచ్చం నాయుడు గారి ద్వారా అందించిన ఎన్ఆర్ఐ టిడిపి సెల్
తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఎన్నారై టిడిపి నిర్వహిస్తున్న ఎన్పవర్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ పొందిన ఆరు మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం మరియు ఎన్నారై టిడిపి ఖతార్, యూఎస్ఏ డేలావర్ ద్వారా ₹7.5 లక్షలు 16 మందికి వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం ఈరోజు జరిగిన కార్యక్రమంలో అందించారు.
వైద్య సహాయం కొరకు అందించిన మొత్తం లో ఖతార్ వారు ₹5.5 లక్షలు 15 మందికి సహాయం అందించారు. డేలావర్ కమిటీ వారు ₹ 1,85,000 లివర్ ట్రాన్స్పరెంట్ కొరకు అవనిగడ్డ వాసికి అందించారు.
అదేవిధంగా ఖతార్ కమిటీ వారు ₹10 లక్షల చెక్ ను పార్టీకి విరాళంగా తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు గారికి ఈ నెల ఒకటో తారీఖున పార్టీ ఆఫీస్ లో కలిసి అందించడం గమనార్హం.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చం నాయుడు, సీనియర్ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, డాక్టర్ రవి వేమూరి, ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్లు కే బుచ్చి రాం ప్రసాద్, సిహెచ్ రాజ శేఖర్, ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ ఎమ్మెస్ ఎన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ ఏ రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ దేశంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇటువంటి సేవా కార్యక్రమాలను అమలు చేయగలుగుతున్నదని మరి ఏ పార్టీకి ఇటువంటి ఘనత లేదని చెప్పారు. ఉద్యోగాలు పొందిన యువతను ఆయన అభినందిస్తూ వారు కూడా సమాజానికి తిరిగి ఏదో ఒక రూపంలో సేవ చేయాలనికోరారు. వైద్య ఖర్చు నిమిత్తం సహాయం కోరేవారు ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సంప్రదించి తగిన సూచనలు పొందాలన్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగాలు కల్పించిన కంపెనీలకు ఆర్థిక సహాయం అందించిన ఖతార్ ఎన్నారై టిడిపి ప్రెసిడెంట్ గొట్టిపాటి రమణ, వైస్ ప్రెసిడెంట్ మద్దిపాటి నరేష్ , గల్ఫ్ టీడీపీ ప్రెసిడెంట్ రావి రాధాకృష్ణ మరియు టిడిపి లీడర్లు కే సుధాకర్ రావు, ఎం సత్యనారాయణ గారి వారి కమిటీ సభ్యులందరికీ మరియు డేలావర్ కమిటీ అధ్యక్షులు సత్య పొన్నగంటి తోపాటు వారి కమిటీ సభ్యులందరికీ పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.